పప్పులో కాలేసిన తాలిబన్లు.. పొరపాటున 8 లక్షల డాలర్లు శత్రుదేశానికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిన తర్వాత అరాచకాలను చూడాల్సి వచ్చింది.. అంతే కాదు.. ఆకలితో అలమటించిపోతున్నారు అక్కడి ప్రజలు.. భారత్ లాంటి దేశాలు ఆదుకోవాడికి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.. ఇక, ప్రభుత్వాన్ని నడపడానికి తాలిబన్లు ఆపసోపాలు పడుతున్నారు.. ఇప్పుడు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అయ్యింది తాలిబన్ల పరిస్థితి.. ఎందుకంటే.. తన వద్దనున్న 8 లక్షల డాలర్లను పొరపాటున తన శత్రుదేశమైన తజికిస్తాన్కి పంపించారు తాలిబన్లు.. అంటే, ఇది భారత్ కరెన్సీలో రూ.6 కోట్లు అన్నమాట.. ఇది చిన్నమొత్తమే అయినా.. అసలే కరువు ఆపైన చేతిలో డబ్బులు కూడా లేని పరిస్థితిల్లో.. ఆ దేశానికి పెద్ద మొత్తమే..
ఇక, పొరపాటును తజికిస్తాన్లోని రాయబార కార్యాలయానికి పంపిన ఆ మొత్తాన్ని వెనక్కి పంపించాలని తాలిబన్లు కోరినా ఆ దేశం నిరాకరిస్తోంది.. ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీకి మద్దతుదారు అయిన తజికిస్తాన్ ప్రభుత్వం.. తాలిబన్లను ఆదినుంచి వ్యతిరేకిస్తోంది.. తాలిబాన్లు ఉగ్రవాదులని పేర్కొంటున్న ఆ దేశం.. అటువంటి ఉగ్రవాదుల బ్యాంకు అకౌంట్లకి డబ్బు పంపించేది లేదని స్పష్టం చేస్తోంది.. అయితే, ఆ మొత్తాన్ని ఆఫ్ఘన్ నుంచి వలస వచ్చి తజకిస్తాన్‌లో శరణార్థి శిబిరాలలో ఉంటున్న పేదల కోసం ఖర్చుపెడతమాని చెబుతోంది. ఇక, ఓ నివేదిక ప్రకారం, ఈ డబ్బును తజికిస్తాన్లో శరణార్థులుగా నివసిస్తున్న పిల్లలకు పాఠశాల విద్యను అందించడానికి ఖర్చు చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ బదిలీ చేయవలసి ఉంది. ఘనీ ఆఫ్ఘనిస్తాన్ నుండి పారిపోయినప్పుడు, తాలిబాన్ ఒప్పందాన్ని రద్దు చేసింది, కానీ, పొరపాటున, ఆ మొత్తాన్ని తజికిస్తాన్‌కు బదిలీ చేసిన తాలిబన్లు.. తలపట్టుకుంటున్నారు.. ఆ డబ్బు వెనక్కి పంపండి మొర్రో అంటూ వేడుకుంటున్నారు.
Also Read
- Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ 'అణు' బాంబ్.. 'సర్మాట్' క్షిపణితో సర్ప్రైజ్!
- Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్‌లో హిందువుల్ని వదిలిపెట్టం..
- Iran Nuclear Warning: అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. 'మాపై చేయి వేస్తే.. అణు విలయమే!'
- Israel-Hezbollah: హిజ్బుల్లా అండర్‌గ్రౌండ్‌ను గుర్తించిన ఐడీఎఫ్.. వీడియో విడుదల
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్‌రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!