ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్ల ఆక్రమణ తరువాత అక్కడ అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలను గౌరవిస్తామని తాలిబన్లు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అలా జరగడంలేదు. మహిళలను రకరకాలుగా హింసిస్తూనే ఉన్నారు. ఒంటరిగా బయటకు వస్తున్న మహిళలను తాలిబన్ ఫైటర్లు హింసిస్తున్నారు. దీనిపై తాలిబన్ నేతలు ఓ వింత ప్రకటన చేశారు. తమ ఫైటర్లకు ఇంకా మహిళలను గౌరవించడం తెలియడం లేదని, వారికి త్వరలోనే మహిళలను ఎలా గౌరవించాలో నేర్పుతామని, అప్పటి వరకు ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ఇంటి నుంచి బయటకు రావొద్దని ప్రకటించారు.
Read: కాబూల్‌లో మరిన్ని దాడులు జరిగే అవకాశం… ప్రతీకారం తీర్చుకుంటామన్న అమెరికా…
