Site icon NTV Telugu

తాలిబ‌న్ల మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం: అధికారుల‌కు క్ష‌మాభిక్ష‌…

నిన్న‌టి వ‌ర‌కు ఉన్న ఆఫ్ఘ‌నిస్తాన్‌లో భ‌యంక‌ర‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.  ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్లు ఆక్ర‌మించుకోవ‌డంతో అరాచ‌క‌పాల‌న మొద‌లౌతుంద‌ని, అనేక ప్రాంతాల్లో అప్ప‌టికే ఆ త‌ర‌హా పాల‌న మొద‌లైంద‌ని ప్ర‌జ‌లు భ‌య‌ప‌డ్డారు.  నెల రోజుల క్రితం నుంచి తాలిబ‌న్ల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో కార్యాల‌యాలు, పాఠ‌శాల‌లు తెరుచుకోక‌పోడంతో తాలిబ‌న్లు అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా అదేవిధ‌మైన పాల‌న కొన‌సాగుతుంద‌ని అనుకున్నారు.  అయితే,  అధికారం మార్పిడి జ‌రుగుతున్న స‌మ‌యంలోనే తాలిబ‌న్ నేత‌లు కీల‌క ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు.  ఇప్ప‌టికే ఎవ‌రి ఇళ్ల‌లోకి చొర‌బ‌డొద్ద‌ని, ఆయుధాలు తీసుకొవ‌ద్ద‌ని, ప్ర‌జ‌ల ఆస్తులు కాపాడాల‌ని ఆదేశాలు జారీ చేశారు.  తాజాగా మ‌రికొన్ని కీల‌క ఆదేశాలు జారీ చేశారు.  ప్ర‌భుత్వంలో ప‌నిచేసిన అధికారుల‌కు క్ష‌మాభిక్ష ప్ర‌క‌టించారు.  అధికారులంతా వెంట‌నే విధుల్లో చేరాల‌ని ఆదేశాలు జారీచేశారు.  ఈ ప్ర‌క‌ట‌న‌తో తిరిగి ఆ దేశంలో శాంతి నెల‌కొనే అవ‌కాశ ఉంటుంది.  త‌మ‌కు శాంతియుత‌మైన అంత‌ర్జాతీయ సంబంధాలు కావాల‌ని ఇప్ప‌టికే తాలిబ‌న్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.  వారి పాల‌న కూడా శాంతియుతంగా, ఆఫ్ఘ‌నిస్తాన్ అభివృద్ధి దిశగా కొన‌సాగితే అంత‌కంటే కావాల్సింది ఏముంటుంది.  

Read: తాలిబ‌న్ నేత కీల‌క ఆదేశాలు…కాబూల్‌లో సాధార‌ణ ప‌రిస్థితులు…

Exit mobile version