ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయింది.. చాలా దేశాలు ఈ పరిణామాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి.. రాక్షస మూకల చేతుల్లోకి ఆఫ్ఘన్ వెళ్లిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. ఈ తరుణంలో తాలిబన్లతో స్నేహానికి తాము సిద్ధమని చైనా ప్రకటిస్తే.. ఇక, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. ఆఫ్ఘన్‌లో జరిగిన పరిణామాలను బానిస సంకెళ్లను తెంచుకోవడంగా అభివర్ణించారు ఇమ్రాన్.. ఇతరుల సంస్కృతిని ఆకళింపు చేసుకోవడంపై స్పందిస్తూ.. ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్‌ను ఓ మీడియంగా తీసుకోవడంపై ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఇతరుల సంస్కృతిని అలవాటు చేసుకొని పూర్తిగా దానికి విధేయులుగా మారుతున్నారన్నారు.. అదే జరిగితే అది బానిసత్వం కంటే కూడా దారుణమన్న ఆయన.. సాంస్కృతికి బానిసత్వాన్ని వదులుకోవడం అంత సులువు కాదన్నారు.. ఆఫ్ఘన్‌లో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? వాళ్లు బానిసత్వపు సంకెళ్లను తెంచారు అంటూ ఇమ్రాన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
తాలిబన్లపై పాక్ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు..
Imran Khan