NTV Telugu Site icon

ఐపీఎల్‌పై తాలిబన్ల కీలక నిర్ణయం

ఐపీఎల్‌పై తాలిబన్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్‌ను ప్రసారం చేయకూడదంటూ ఆప్ఘనిస్థాన్‌లో పాలన చేపట్టిన తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మీడియా సంస్థలను ఆదేశించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి వారు చెప్పిన కారణం కూడా విడ్డూరంగా ఉంది. ఐపీఎల్ జరిగే స్టేడియంలో మహిళా ప్రేక్షకులు ఉంటారని, మ్యాచ్‌ల సందర్భంగా చీర్‌ గాల్స్‌ డ్యాన్స్ చేస్తారని… అందుకే ఐపీఎల్ ప్రసారాలను బ్యాన్ చేస్తున్నట్టు తెలిపారు. అఫ్ఘానిస్తాన్‌ను చేజిక్కించుకున్నప్పటి నుంచి మహిళలపై తాలిబన్లు ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తున్నారు. మహిళల గౌరవాన్ని కాపాడతామని తాలిబన్లు ప్రకటించినప్పటికీ… ఆ మేరకు వారు ఏ మాత్రం వ్యవహరించడం లేదు. అన్ని రకాల క్రీడలకు మహిళలకు దూరం చేశారు. ఇంటికే పరిమితం కావాలని, పురుషుల తోడు లేకుండా ఇంటి గడప కూడా దాటరాదని హుకుం జారీ చేసింది.