NTV Telugu Site icon

Afghanistan: మహిళలకు తాలిబాన్ సర్కార్ కొత్త రూల్.. ఇకపై అక్కడికి వెళ్లకుండా నిషేధం

Afghanistan Taliban

Afghanistan Taliban

Taliban ban Afghan women from gyms, public baths: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై నిషేధం ఎక్కువైంది. మహిళలు కేవలం ఇళ్లకు మాత్రమే పరిమితం అయ్యారు. బయటకు వెళ్లాలన్నా మగతోడు కావాల్సిందే. ఇక మహిళ హక్కులనే మాటకు అక్కడ స్థానమే లేదు. ప్రజా ప్రభుత్వం ఉన్నంత వరకు ప్రభుత్వంలో ఇతర రంగాల్లో ఉద్యోగాలు చేసిన మహిళలు ప్రస్తుతం ఉద్యోగాలను కోల్పోయారు. గతేడాది ఆగస్టులో అధికారంలోకి వచ్చిన తాలిబాన్లు అక్కడ మహిళపై తీవ్రమైన ఆంక్షలను విధిస్తున్నారు. మహిళలు విద్యకు దూరం అయ్యారు.

Read Also: Kochi molestation case: కొచ్చి మహిళపై సామూహిక అత్యాచారం.. సీఐతో సహా నలుగురి అరెస్ట్

ఇదిలా ఉంటే తాజాగా జిమ్‌లు, పబ్లిక్ బాత్‌లకు వెళ్లకుండా అక్కడి మహిళలపై నిషేధం విధించారు. దీన్ని ఆదివారం తాలిబాన్ ప్రభుత్వం కూడా ధృవీకరించారు. పార్కులకు వెళ్లకుండా మహిళలపై నిషేధం విధించిన కొన్ని రోజుల్లోనే కొత్తగా ఈ నిబంధనలను తీసుకువచ్చింది తాలిబాన్ సర్కార్. 2001 తర్వాత అధికారం కోల్పోయిన తాలిబాన్లు, 2021లో అమెరికా సైన్యం వైదొలగడంతో మళ్లీ అధికారంలోకి వచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కఠినమైన ఇస్లామిక్ చట్టాలను అమలు చేయమని హామీ ఇచ్చినప్పటికీ అందుకు కట్టుబడి ఉండటం లేదు. ఇప్పటికే టీనేజ్ అమ్మాయిలకు విద్యను నిలిపివేసింది. బహిరంగ ప్రదేశాల్లో తప్పకుండా హిజాబ్, బురఖా ధరించాల్సిందే.

మహిళల జిమ్‌లు మూసివేయబడ్డాయి.. ఎందుకంటే వారి శిక్షకులు పురుషులు. వారితో కలిసి జిమ్ చేస్తున్నారని తాలిబాన్ మత వ్యవహారాలను పర్యవేక్షించే మంత్రిత్వశాఖ ప్రతినిధి అకిఫ్ సాడెక్ మొహజిర్ అన్నారు. అయితే తాలిబాన్ల నిర్ణయంపై అక్కడి మహిళలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహిళపై విధిస్తున్న ఆంక్షలపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు తాలిబాన్ పరిపాలనలో అక్కడి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఉద్యోగాలు, ఉపాధి లేదు. దీంతో చాలా మంది ఆఫ్ఘన్లు తమ కిడ్నీలను, పిల్లలను అమ్ముకుంటున్నారు.