Donald Trump: ఉక్రెయిన్‌కి మద్దతు ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ, రష్యా డొనాల్డ్ ట్రంప్ హత్యాయత్నాన్ని ఖండించింది. ద్వేషాన్ని రెచ్చగొట్టే విధానాలను అంచనా వేయాలని అమెరికాకు పిలుపునిచ్చింది. ఉక్రెయిన్‌కి అమెరికా ఆయుధాలను సరఫరా చేసే వారి గురించి ప్రస్తావిస్తూ రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా కీలక వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా జోబైడెన్ అడ్మినిస్ట్రేషన్‌ని విమర్శించారు. అమెరికా సాయం రష్యన్ అధ్యక్షుడిపై దాడిని ప్రేరేపించిందని ఆమె అన్నారు. ఆమె మాట్లాడుతూ.. బహుశా ఈ డబ్బును అమెరికా పోలసులు, అమెరికాలో శాంతిభద్రతలను నిర్ధారించే ఇతర సేవలకు నిధులు సమకూర్చడం మించిదేమో..? అంటూ వ్యాఖ్యానించారు.
Read Also: Donald Trump: ఈ దాడిని మరిచిపోము.. ట్రంప్ హత్యాయత్నంపై బైడెన్‌ని టార్గెట్ చేస్తున్న రిపబ్లికన్లు..
ఇటీవల పలుమార్లు ఎన్నికల ప్రచారంలో తాను అధ్యక్షుడిగా గెలిస్తే, ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆగిపోయేలా చేస్తానంటూ ప్రకటించారు. అయితే, ఈ పరిణామం ఉక్రెయిన్‌కి రుచించడం లేదని తెలుస్తోంది. ఒక వేళ నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధిస్తే, ఉక్రెయిన్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుంది.
దాడి గురించి మాట్లాడుతూ.. పుతిన్ యుద్ధాన్ని ముగించడం గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ‘‘చాలా తీవ్రంగా’’ తీసుకున్నట్లు చెప్పారు. 1963లో ప్రెసిడెంట్ జాన్ ఎఫ్. కెన్నెడీ హత్యను ప్రస్తావిస్తూ ‘‘ సమస్యాత్మక అధ్యక్షుడిని వదిలించుకోవడానికి ఇతర మార్గాలు అయిపోయినప్పుడు, మంచి పాత లీ హార్వే ఓస్వాల్డ్ అమలులోకి వస్తాడు’’ అని జఖరోవా అన్నారు. ఆయన మరణం అనేక కుట్ర సిద్ధాంతాలకు మూలమని, ఇది అమెరికా రాష్ట్ర యంత్రాంగం లోపలి నుంచి ఆదేశించబడిందని ఆరోపించారు. యూఎస్ మాజీ మెరైన్ లీ హార్వే ఓస్వాల్డ్ జే ఎఫ్ కెన్నడీని హతమార్చాడు.