NTV Telugu Site icon

Syria: అసద్ భార్య యూకేలో లేదు.. తేల్చి చెప్పిన బ్రిటన్ పీఎంవో

Syriauk

Syriauk

సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ భార్య అస్మా యూకేకి తిరిగి రాలేదని బ్రిటన్ ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. బ్రిటిష్-సిరియా జాతీయురాలైన అస్మా.. భర్త అసద్ పాలనలోని యుద్ధ నేరాల్లో ఆమె పాత్ర కారణంగా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ప్రయాణ నిషేధాలు, ఆస్తుల జప్తులు అమల్లో ఉన్నాయి.

ఇదిలా ఉంటే సిరియా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయాక.. అధ్యక్షుడు అసద్‌ రష్యాకు పారిపోయాడు. అయితే అసద్ భార్య అస్మా రష్యాలో ఉండేందుకు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అసద్‌కు అస్మా విడాకులు ఇచ్చేసి యూకేకు వెళ్లిపోయినట్లు వార్తలు వినిపించాయి. అస్మా.. యూకే పౌరురాలు. భర్తకు విడాకులు ఇచ్చి సొంత దేశానికి చేరుకుందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. తాజాగా ఇదే విషయంపై బ్రిటన్ ప్రభుత్వం స్పందించింది. అస్మా.. యూకేకు రాలేదని బ్రిటన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది.

ఇటీవల సిరియాను రెబల్స్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో అధ్యక్షుడు అసద్.. రష్యాకు పారిపోయాడు. ప్రస్తుతం రష్యాలో రాజకీయ శరణార్థిగా ఉంటున్నారు. అయితే ముందు జాగ్రత్తగా అసద్.. భారీగానే నగదు కూడబెట్టుకున్నట్లు వార్తలు వినిపించాయి. విమానాల్లో కట్టలు.. కట్టలు డబ్బులు రష్యాకు తరలించినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే అమెరికా, ఇజ్రాయెల్ కుట్రలో భాగంగానే సిరియాపై తిరుగుబాటుదారులు చెలరేగిపోయారని ఇరాన్ ఆరోపించింది. ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ధ్వజమెత్తారు. సిరియా భూభాగం ఆక్రమించుకోవడం అంతర్జాతీయ నేరంగా పరిగణించాలని ఖమేనీ పేర్కొన్నారు.

Show comments