Site icon NTV Telugu

Sweden: 16 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం ‘‘తక్కువ సమయమే’’ జరిగిందట.. స్వీడన్ కోర్టు తీర్పుపై ఆగ్రహం..

Meya Swedan

Meya Swedan

Sweden: యూరప్ దేశాలకు ఏమైంది. సొంత దేశ అమ్మాయిలపై అత్యాచారాలు జరిగినా కూడా, మానవ హక్కులు, శరణార్థి హక్కులు అంటూ వ్యవహరిస్తూ, నేరస్తుల్ని శిక్షించడం లేదు. శరణార్థులుగా ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, గల్ఫ్ దేశాల నుంచి యూరప్ దేశాలకు వచ్చిన వ్యక్తులు నేరాల్లో భాగస్వాములు అవుతున్నారు. బ్రిటన్, బెల్జియం, ఫ్రాన్స్, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్ ఇలా పలు దేశాల్లో నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా, 16 ఏళ్ల అమ్మాయి అత్యాచార కేసులో స్వీడన్ కోర్టు ఇచ్చిన తీర్పును, ప్రపంచం తీవ్రంగా విమర్శిస్తోంది.

16 ఏళ్ల బాలికపై ఆఫ్రికా దేశమైన ఎరిత్రియాకు చెందిన శరణార్తి యాజిద్ మొహమ్మద్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, ఈ కేసులో దోషిగా తేలిన వ్యక్తిని దేశం నుంచి బహిష్కరించకూడదని స్వీడన్ కోర్టు తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రపంచంలో ఏం జరుగుతోంది..?’’ అని ప్రశ్నించారు.

Read Also: Pakistan: పాక్ అణ్వాయుధాలు అమెరికా చేతిలో ఉన్నాయా..? మాజీ-సీఐఏ అధికారి సంచలనం..

రేప్ జరిగిన సమయం తక్కువ అని, యాజిద్ మొహమ్మద్ అనే వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు, జైలు శిక్ష తర్వాత దేశం నుంచి బహిష్కరించబోమని అప్పర్ నార్త్ అప్పీల్ కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు తన తీర్పులో.. అత్యాచారం ‘‘తగినంత తీవ్రమైనది కాదు’’ అని పేర్కొంది. అత్యాచార తీవ్రమైన నేరంగా పరిగణించబడేలా ఎక్కువ టైమ్ కొనసాగలేదు, కాబట్టి అతడిని దేశం నుంచి బహిష్కరించే అవసరం లేదు అని పేర్కొంది.

ఈ సంఘటన గత ఏడాది సెప్టెంబర్ 1న జరిగింది. 16 ఏళ్ల అమ్మాయి మేయా మెక్‌డొనాల్డ్స్ వద్ద పని ముగించుకుని సబ్-వే గుండా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో 18 ఏళ్ల యాజిద్ మొహమ్మద్ ఆమెను అత్యాచారం చేశాడు. స్వీడన్ కోర్టు తీర్పుపై ట్రంప్ జూనియర్ సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఈ ప్రపంచంలో ఏం జరుగుతోంది?? చిన్న అత్యాచారమని, చెడ్డ వ్యక్తిని దేశం నుంచి పంపించమని యూరప్ అంటోంది. ప్రజలారా మేల్కొంది. మనం మంచివాళ్లమని చూపించుకునే ప్రయత్నంలో మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాము’’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Exit mobile version