Site icon NTV Telugu

Typhoon Ragasa: తైవాన్, చైనాలో పెను విధ్వంసం సృష్టించిన తుఫాన్.. వీడియోలు వైరల్

Typhoonragasa

Typhoonragasa

రాగస తుఫాన్ తైవాన్, చైనాలో పెను విధ్వంసం సృష్టించింది. మునుపెన్నడూ లేని విధంగా తైవాన్‌లో జలప్రళయం విరుచుకుపడింది. 195-200 కి.మీ వేగంతో తీవ్ర గాలులు, కుండపోతగా కురిసిన వర్షంతో తైవాన్ అతలాకుతలం అయింది. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద స్థాయిలో తుఫాన్ సంభవించడం ఇదే తొలిసారి కావడం విశేషం. తైవాన్‌లోని హువాలియన్‌లో బారియర్ సరస్సు ఉప్పొంగడంతో 14 మంది చనిపోగా.. 124 మంది గల్లంతయ్యారు. ఇక నీళ్లు కార్యాలయాల్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

ఇది కూడా చదవండి:Trump-Shehbaz Sharif: యూఎన్‌లో ట్రంప్‌తో పాక్ ప్రధాని సంభాషణ.. రేపు వైట్‌హౌస్‌లో ప్రత్యేక భేటీ

ప్రస్తుతం తుఫాను చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్, హాంకాంగ్ వైపు దూసుకుపోతోంది. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తీవ్రమైన గాలులు కారణంగా తైవాన్, హాంకాంగ్ ప్రజలు బుధవారం ఉదయం హడలెత్తిపోయారు. భీకరమైన ఈదురుగాలుల కారణంగా ప్రాణభయంతో బిల్డింగ్‌ల పైకి పరుగులు పెట్టారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. 2009లో దక్షిణ తైవాన్‌లో వచ్చిన తుఫాన్ కారణంగా 700 మంది చనిపోయారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థాయిలో తుఫాన్ వచ్చింది.

ఇది కూడా చదవండి: Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు చేదు అనుభవం.. ట్రంప్ కాన్వాయ్ కారణంగా రోడ్డుపై నిలిపివేత

బుధవారం మధ్యాహ్నం-సాయంత్రం మధ్యలో గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని తైషాన్, ఝాంజియాంగ్ మధ్య రాగస తుఫాన్ తీరాన్ని తాకుతుందని చైనా జాతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ తుఫాను గ్వాంగ్‌డాంగ్, పొరుగున ఉన్న ఫుజియాన్ ప్రావిన్స్ అంతటా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హాంకాంగ్ అబ్జర్వేటరీ ప్రకారం.. రాగస తుఫాను గంటకు 195 కి.మీ (120 మైళ్ళు) వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపింది. తుఫాన్ గంటకు 22 కి.మీ (సుమారు 14 మైళ్ళు) వేగంతో పశ్చిమం లేదా పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉందని అంచనా వేసింది.

Exit mobile version