USA: సోలార్ ప్రాజెక్టుల వ్యవహారంలో లంచాలు ఇచ్చాడని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికా అభియోగాలు మోపింది. అయితే, అమెరికా రిపబ్లికన్ లా మేకర్ లాన్స్ గూడెన్ అదానీకి మద్దతుగా నిలిచారు. బైడెన్ తన పదవి నుంచి దిగిపోయే సమయంలో, మిత్రదేశాల మధ్య సంబంధాలను చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. . అటార్నీ జనరల్ మెరిక్ బి గార్లాండ్‌కు రాసిన లేఖలో.. అమెరికా పొత్తులను భంగం కలిగించాలని చూస్తున్నారని, దీంట్లో జార్జ్ సోరోస్ ప్రమేయం ఏదైనా ఉందా.? అని ప్రశ్నించారు.
Read Also: Champions Trophy 2025: ఈ దెబ్బతో ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ కోల్పోనుందా?
అదానీ గ్రూపుపై ఆరోపణలు నిరాధారమైనవిగా కొట్టిపారేశారు. దేశంలో పెరుగుతున్న హింసాత్మక నేరాల గురించి న్యాయశాఖకు తెలియదని, విదేశాల్లోని వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని బైడెన్ ప్రభుత్వాన్ని గూడెన్ ఆరోపించారు. ఒక వేళ అదానీపై ఆరోపణలు నిజమైనప్పటికీ భారతదేశంలో అమెరికా ఎలా విచారణ జరుపుతుందని ప్రశ్నించారు. ఈ ఆరోపణలు భారత్ వంటి ఆర్థిక, రాజకీయ మిత్రుడితో సంబంధాలను దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారత్, అమెరికాకు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు విశ్వసనీయ భాగస్వాముల్లో ఒకటి అని చెప్పారు.