Site icon NTV Telugu

America: విద్యార్థినిపై పిడుగుపాటు.. అమెరికాలో ఘటన

America

America

America: భారతీయులు విదేశాలకు వివిధ పనుల కోసం వెళుతుంటారు. ప్రధానంగా ఉన్నత విద్యను అభ్యసించడంతోపాటు.. ఉద్యోగాల కోసం ప్రపంచంలోని వివిధ దేశాలకు వెళుతుంటారు. అందులో ఎక్కువ మంది ఉన్నత విద్యతోపాటు.. ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లే భారతీయు ఎక్కువగా ఉంటారు. ఇప్పటికీ అమెరికాలో ప్రవాస భారతీయులు ఎక్కువ మంది ఉంటారు. అలా అమెరికాలో ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం వెళుతున్న వారిలో కొందరు ప్రమాదాలకు గురవుతున్న వారు కూడా ఉంటున్నారు. ప్రమాదాలకు గురై మరణిస్తున్న వారు కొందరైతే.. ప్రమాదాల నుంచి బయట పడుతున్న వారు మరికొందరు. భారత సంతతికి చెందిన ఒక విద్యార్థిని పిగుడుపాటుకు గురైంది. విద్యార్థినిపై పిడుగు పడింది. పిడుగుపాటుకు గురైన విద్యార్థిని మృత్యుతో పోరాడుతోంది. ఉన్నత విద్య కోసం అమెరికా వచ్చిన సుశ్రూణ్య పిడుగుపాటుకు గురైంది. ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోంది.

Read also: Kishan Reddy: నేడే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు.. పాల్గొననున్న ముఖ్యనేతలు

ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని పిడుగుపాటుకు గురై మృత్యువుతో పోరాడుతోంది. యూనివర్సిటీ ఆఫ్‌ హ్యూస్టన్‌ (యూహెచ్‌)లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో మాస్టర్స్‌ చేస్తున్న విద్యార్థిని సుశ్రూణ్య కోడూరు (25) జులై మొదటివారంలో తన స్నేహితులతో కలిసి స్థానిక పార్కులో ఓ కొలను వెంబడి నడుచుకుంటూ వెళుతున్న సమయంలో పిడుగుపాటుకు గురైంది. వెంటనే విద్యార్థిని ఆసుప్రతికి తరలించి చికిత్సను అందించారు. అయితే ఈ ఘటనలో ఆమె మెదడు దెబ్బతిన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. చాలా కీలకమైన వైద్యచికిత్సను సుదీర్ఘకాలం అందించాల్సి ఉంటుందని సుశ్రూణ్య బంధువు సురేంద్రకుమార్‌ కొత్త తెలిపారు. ఈ మేరకు ఆమె వైద్యఖర్చుల కోసం, అలాగే కుటుంబసభ్యులను పిలిచేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కోరుతూ ఆన్‌లైన్‌లో ‘గోఫండ్‌మీ’ని ఏర్పాటు చేశారు. సుశ్రూణ్య పిడుగుపాటుకు గురైన వెంటనే కొలనులో పడిపోయారని, ఆ సమయంలో 20 నిమిషాలపాటు గుండె లయ తప్పడంతో మెదడు దెబ్బతిన్నట్లు సురేంద్ర తెలిపారు. తర్వాత ఆమె కోమాలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం కోమాలోనే ఉన్నారని తెలిపారు.

Exit mobile version