ప్రపంచం మొత్తం కరోనాతో టెన్షన్ పడుతుంటే, ఆఫ్ఘనిస్తాన్‌లో మాత్రం తాలిబన్లతో టెన్షన్ పడుతున్నది. తాలిబన్లు ఆక్రమణలతో ఆ దేశం ఇప్పుడు అయోయమ స్థితిలో పడిపోయింది. 1996 నుంచి 2001 వరకు ఆ దేశాన్ని తాలిబన్లు పరిపాలించిన సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదరుర్కొన్నారో అక్కడి ప్రజలు ఇంకా మర్చిపోలేదు. 12 ఏళ్లు దాటిన చిన్నారులు స్కూళ్లకు వెళ్లడంపై నిషేదం ఉన్నది. షరియా చట్టాల ప్రకారమే వారు పరిపాలిస్తుంటారు. ఇప్పుడు సుపరిపాలన అందిస్తామని, మహిళల హక్కులు గౌరవిస్తామని చెబుతున్నా వారి మాటలకు, చేతలకు ఏమాత్రం పొందిక కుదరడంలేదన్నది వాస్తవం. 20 ఏళ్ల కాలంలో ప్రజలు కొంత స్వేచ్చను పొందారు. బాలికలు ఉన్నత విద్యను అభ్యసించారు. అయితే, ఇప్పుడు మరోసారి వారంతా విద్యకు దూరం కావాల్సి వస్తున్నది. బాలికలు చదువుకున్న స్కూళ్లలో వారికి సంబందించిన రికార్డులను అక్కడి అధికారులు తగలబెడుతున్నారు. స్కూళ్లలో చదువుకున్న బాలికల వివరాలు తాలిబన్ల చేతికి చిక్కకూడదనిచెప్పి ఆ రికార్డులను తగలబెడుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. బాలికల భవిష్యత్తుకోసమే ఇలా చేస్తున్నామని అంటున్నారు.
Read: పంజ్‌షీర్ ప్రావిన్స్‌లో ఉద్రిక్తత: 300 మంది తాలిబన్లు హతం…
