Site icon NTV Telugu

Steve Ballmer: పనిచేయకుండానే రూ.830 కోట్ల సంపాదించిన మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ..! ఎలా అంటే?

Steve Ballmer

Steve Ballmer

కష్టపడకుండ డబ్బు సంపాదించాడం ఏలా అని చాలా మంది కలలు కంటారు. అదే అభిప్రాయాన్ని బయటపెట్టిన వారికి కస్టేఫలి అనే సూక్తిని గుర్తు చేస్తూ క్లాస్ పీకుతుంటారు పెద్దలు. నిజానికి కష్టపడకుంటే ఏదీ సాధ్యం కాదు. ఇక డబ్బు సంపాదించడమనేది అసాధ్యమే. అదీ కూడా కోట్లు సంపాదించడమంటే అద్భుతమే అనాలి. అలాంటి అద్భుతమే ఇప్పుడు ఓ వ్యక్తి జీవితంలో జరిగింది. ఆయనే మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ స్టీవ్ బాల్మెర్. ఏ పనిచేయకుండా, ఏలాంటి కష్టం పడకుండా ఆయన ఈ ఏడాది రూ. 830 కోట్లు సంపాదించాడు. ఇంతకి అదేలా సాధ్యమైంది, దాని వెనుక ఉన్న అసలు విషయం ఏంటో తెలుసుకుందాం!

Also Read: Ayodhya New Airport : అయోధ్యలోని కొత్త విమానాశ్రయానికి ఏం పేరు పెట్టారో తెలుసా?

వివరాలు.. టెక్ దిగ్జజ కంపెనీ మైక్రోసాఫ్ట్‌లో అతిపెద్ద వాటాదారు ఉన్న మాజీ సీఈఓ బాల్మెర్.. కంపెనీలో దాదాపు 4 శాతం వాటాను కలిగి ఉన్నారు. దీని వాల్యూ దాదాపు 333.2 మిలియన్ షేర్లకు సమానమని ఇటీవల సీఎన్ఎన్ తన నివేదికలో పేర్కొంది. అయితే ఇప్పుడు ఈ వాటా విలువ ఏకంగా 130 బిలియన్ డాలర్లకు పెరగడంతో ఈ ఏడాది ఆయన సంపద 44 బిలియన్ డాలర్లు పెరిగినట్లు సమాచారం. ఇక ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ షేర్ ధ‌ర ఏకంగా 56 శాతం పెర‌గ‌డంతో బాల్మెర్ సంపాద‌న కూడా మరింత పెరిగింది.

Also Read: Aditya-L1 Mission: తొలి సోలార్‌ మిషన్‌ ఆదిత్య-ఎల్‌1 గురించి ఇస్రో చీఫ్‌ కీలక ప్రకటన

ఈ క్రమంలో 2023 గానూ స్టీవ్ బాల్మెర్ మైక్రోసాఫ్ట్ వార్షిక డివిడెండ్ చెల్లింపులలో 1 బిలియన్లను (భారత కరెన్సీ ప్రకారం రూ. 830 కోట్లకు పైగా) అందుకోబోతున్నారు. అయితే 1980లో 30వ ఉద్యోగిగా చేరిన స్టీవ్ బాల్మెర్ అతి తక్కువ కాలంలోనే గణనీయమైన వాటాను సంపాదించాడు. అంతే కాకుండా 2000లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికై 2014లో పదవీవిరమణ చేశాడు. వాటా యాజమాన్యం కారణంగా, స్టీవ్ బాల్మెర్ ప్రపంచ ధనవంతుల జాబితాలో నాల్గవ స్థానంలో చేరటానికి అవకాశం ఉందని తెలుస్తోంది.

Exit mobile version