Starship Super Heavy: ఆకాశంలో పేలిన వరల్డ్ బిగ్గెస్ట్ రాకెట్.. ప్రయోగ సమయంలో విఫలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Starship Super Heavy: ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన, అతిపెద్ద రాకెట్ ప్రయోగం విఫలం అయింది. ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ శక్తివంతమైన రాకెట్ ‘‘ స్టార్ షిప్ సూపర్ హెవీ’’ని ఈ రోజు ప్రయోగించింది. అయితే ఇది భూమి నుంచి ఆకాశంలోకి వెళ్లినా, కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆకాశంలోనే పేలిపోయింది. టెక్సాస్ లోని బోకా కికాలోని ఎలాన్ మస్క్ ఏరోస్పేస్ ఫెసిలిటి స్టార్ బేస్ నుంచి లిఫ్ట్ ఆఫ్ అయిన కొద్ది సేపటికే పేలిపోయింది.
ఈ సూపర్ హెవీ రాకెట్ మొత్తం 33 రాఫ్టర్ ఇంజిన్ల సహాయంలో ఆకాశంలోకి బయలుదేరింది. అయితే తొలి దశ తర్వాత రాకెట్ నుంచి సపరేట్ కావాల్సిన బూస్టర్లు విడిపోలేదు. దీంతో రాకెట్ గతి తప్పి ఆకాశంలో అస్తవ్యస్తంగా ప్రయాణించింది. మూడు నిమిషాల తర్వాత రాకెట్ నుంచి బూస్టర్లు విడిపోయేలా ప్లాన్ చేశారు. అయితే ఇవి సపరేట్ కాని కారణంగా నాలుగు నిమిషాల్లోనే ఈ భారీ రాకెట్ అగ్నికి ఆహుతి అయింది. అయితే ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకుని సరిదద్దుకుంటామని స్పేస్ ఎక్స్ చెప్పింది.
Also Read
- China: కొత్త గేమ్‌కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
- Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్‌పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్‌కు స్పష్టమైన సందేశం..
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
Read Also: Srisailam Temple: శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్
స్టార్ షిప్ ప్రయోగం ఎందుకోసం..?
భవిష్యత్తులో చంద్రుడు, అంగారక గ్రహాలపైకి భారీ మొత్తంలో పేలోడ్ ను తీసుకెళ్లేందుకు ఈ రాకెట్ ను తయారు చేసి ప్రయోగించారు. ప్రస్తుతం పేలిన స్టార్ షిప్ హెవీ భూమిని నుంచి 150 మైళ్ల ఎత్తుకు వెళ్లాల్సిందిగా ప్లాన్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు మార్గం మధ్యలోనే పేలిపోయింది. స్టార్‌షిప్ సూపర్ హెవీ లిక్విడ్ మీథేన్ (CH4) మరియు లిక్విడ్ ఆక్సిజన్ (LOX) ద్వారా ఇంధనం ద్వారా రాఫ్టర్ ఇంజిన్లతో పనిచేస్తుంది. 2025 చివరిలో చంద్రుడిపైకి వ్యోమగాములను తీసుకెళ్లాలని నాసా ‘ఆర్టెమిస్-3’’ ప్రయోగాన్ని చేపట్టబోతోంది. దీని కోసం స్టార్ షిప్ అంతరిక్ష నౌకను ఎంపిక చేసింది.
స్టార్‌షిప్‌లో 164-అడుగుల (50-మీటర్లు) పొడవైన అంతరిక్ష నౌక ఉంటుంది, ఇది 230-అడుగుల బూస్టర్ మొదటి దశలో రాకెట్ పైకెళ్లడానికి సహాయపడుతాయి. గతంలో చంద్రుడిపైకి వ్యోమగాములను తీసుకెళ్లేందుకు నాసా స్పేస్ లాంచ్ సిస్టమ్(ఎస్ఎల్ఎస్)ని ఉపయోగించింది. ఎస్ఎల్ఎస్ తో పోలిస్తే స్టార్ షిప్ చాలా శక్తివంతమైంది. ఇది 100 మెట్రిక్ టన్నులను కక్ష్యలోకి పంపించగలదు. 17 మిలియన్ల థ్రస్ట్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది అపోలో ప్రయోగాల్లో ఉపయోగించిన సాటర్న్-5 రాకెట్ కన్నా రెండు రెట్లు ఎక్కువ.
They've lost it, going for a spin, but hey, got away from the pad and had some great first stage!https://t.co/npUj2AHByW pic.twitter.com/KbvlbhjYR9
— NSF – NASASpaceflight.com (@NASASpaceflight) April 20, 2023
తాజావార్తలు
-
NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్‌కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
-
CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!