Site icon NTV Telugu

Paskistan Crisis: పిండి కోసం తొక్కిసలాట.. కొట్టుకుంటున్న ప్రజలు

Pakistan Economic Crisis

Pakistan Economic Crisis

Stampedes across Pakistan as flour shortage intensifies: పాకిస్తాన్ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. ఎంతలా అంటే ప్రజలకు పిండి, గ్యాస్ ఇవ్వలేని పరిస్థితి ఉంది అక్కడ. చివరకు గోధుమ పిండి కోసం ప్రజలు కొట్టుకోవడం, తొక్కిసలాటలు జరుగుతున్నాయి. తాజాగా సింధ్ ప్రభుత్వం ప్రజలకు సబ్సిడీపై పిండిని సరఫరా చేసింది. మ ఈ సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడటంతో తొక్కిసలాట జరిగింది. మిర్‌పుర్‌ఖాస్ జిల్లాలో ఏడుగురు పిల్లల తండ్రి అయిన వ్యక్తి తొక్కసలాటలో చనిపోయాడు.

Read Also: Hardik Pandya: సూర్యకుమార్‌కు బౌలింగ్ చేస్తే ఆ షాట్లకు భయపడేవాడిని

పాకిస్తాన్ వ్యాప్తంగా పిండి రేట్లు ఆకాశానికి అంటడంతో సింధ్ ప్రభుత్వం సబ్సిడీపై రూ. 65లకే 10 కిలోల పిండిని విక్రయిస్తోంది. అయితే పిండి బస్తాలను తెచ్చిన ట్రక్కు చుట్టు ప్రజలు పెద్ద ఎత్తన గుమిగూడటం, ముందుగా పిండిని తీసుకోవాలని చూడటంతో తొక్కిసలాట జరిగింది. 40 ఏళ్ల హర్ సింగ్ కోలీ ఈ గందరగోళంలో కింద పడిపడిపోయి చనిపోయాడు. ఈ మరణంతో బాధితుడి కుటుంబీకులు ఐదు గంటల పాటు నిరసనకు దిగారు. సింధ్ ప్రాంతంలో పిండి విక్రయం గందరగోళానికి దారి తీసింది. పలు ప్రాంతాల్లో ప్రజలు గాయపడ్డారు. మైనర్ బాలికతో పాటు ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.

గతేడాది అక్టోబర్ నెలలో పాకిస్తాన్ వ్యాప్తంగా భారీగా వరదలు సంభవించాయి. మూడోంతుల భూభాగం నీటితో నిండిపోయింది. దీంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో గోధుమకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పాకిస్తాన్ లో ఇటీవల కాలంలో పిండి ధరలు తీవ్రంగా పెరిగాయి. కిలో పిండి ధర రూ. 140 నుంచి రూ.150కి పెరిగింది. పెషావర్ ప్రాంతంలో 10 కిలోల పిండి ధర పాక్ రూపాయల్లో రూ. 1500గా ఉంది. ఇక క్వెట్టా ప్రాంతంలో 20 కిలోల పిండి ధర రూ. 2800 గా ఉంది. బలూచిస్తాన్ ప్రాంతంలో గోధుమ స్టాక్ ముగిసిందని సంక్షోభం ముందర ఉందని అక్కడి ప్రభుత్వం పేర్కొంది.

Exit mobile version