NTV Telugu Site icon

Srilanka Crisis: నిత్యావసరాలు, మందుల కోసం శరీరాన్ని అమ్ముకుంటున్న మహిళలు

Srilanka Economic Crisis

Srilanka Economic Crisis

శ్రీలంక ఆర్థిక సంక్షోభం అక్కడి మహిళల పాలిట నరకంగా మాారాయి. నిత్యావసరాలు, మందుల కోసం శరీరాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ బిడ్డలు, తమను నమ్ముకుని ఉన్నవారి ఆకలి తీర్చేందుకు వ్యభిచార రొంపిలోకి దిగుతున్నారు. అక్కడి ఆర్థిక సంక్షోభం శ్రీలంక మహిళలను దీనస్థితిలోకి నెట్టేశాయి. శ్రీలంక ఆర్థిక పరిస్థితి దిగజారిన తరువాత వస్త్ర పరిశ్రమల్లో పనిచేసే మహిళలు వ్యభిచారంలోకి నెట్టబడుతున్నారు.

శ్రీలంకలో ఆర్థిక సంక్షోెభం తరువాత టెక్స్ టైల్స్ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. దీంట్లో పనిచేస్తున్న మహిళలు ప్రత్యామ్నాయ పనులు లేకపోవడంతో ఇళ్లు గడిచేందుకు శరీరాన్ని అమ్ముకుంటున్నారు. ఈ ఆర్థిక సంక్షోభ సమయంలో ఉద్యోగాలు కోల్పోయామని.. ఈ సమయంలో సెక్క్ వర్క్ దిక్కవుతుందని కొంతమంది మహిళలు చెబుతున్నారు. టెక్స్ టైల్స్ లో పనిచేసే సమయంలో నెలవారీ జీతం రూప. 28,000 నుంచి గరిష్టంగా రూ. 35,000 వరకు ఉండేదని.. ప్రస్తుతం సెక్క్ వర్క్ వల్ల రోజుకు రూ. 15,000 సంపాదించుకుంటున్నామని ఓ మహిళ చెప్పింది.. అయితే అందరూ నాతో ఏకీభవించరు కానీ.. ఇది నిజం అని ది మార్నింగ్ కు వెల్లడించింది. ఆర్థిక సంక్షోభం వల్ల భారత్, బంగ్లాదేశ్ లకు శ్రీలంక 10-20 శాతం ఆర్డర్లను కోల్పోతున్నట్లు అక్కడి అపెరెల్ అసోసియేషన్ వెల్లడించింది.

Read Also: Business Flash: ప్రపంచ కుబేరుల జాబితాలో బిల్‌గేట్స్‌ని దాటేసిన అదానీ

ముఖ్యంగా రాజధాని కొలంబో ప్రాంతంలో సెక్స్ వర్కర్లుగా చేరిన మహిళల సంఖ్య 30 శాతం పెరిగిందని.. మహిళలు గతంలో వస్త్ర పరిశ్రమలో ఉపాధి పొందిన వారే అని అక్కడి న్యాయవాది గ్రూప్ స్టాండ్ ఆఫ్ మూమెంట్ లంక వెల్లడించింది. ఇంధనం, నిత్యావసరాలు, ఔషధాల అవసరం ఏర్పడినప్పుడు అక్కడి మహిళల పరిస్థితి మరింత దుర్భరంగా మారుతుంది. నిత్యావసరాల కోసం అక్కడి దుకాణదారులతో శృంగారంలో పాల్గొనాల్సి వస్తోంది. కొలంబో బండారు నాయకే విమానాశ్రయ ప్రాంతంలో లైంగిక వ్యాపారం పెరుగుతోంది. చివరకు పోలీసులతోె కూడా ఒళ్లు అమ్ముకోవాల్సి వస్తోందని అక్కడి మహిళలు వాపోతున్నారు.