Site icon NTV Telugu

Srilanka crisis: ప్రధాని పదవికి రణిల్ విక్రమసింఘే రాజీనామా

Ranil Wickremesinghe

Ranil Wickremesinghe

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తలెత్తుతోంది. ఆందోళనలతో ద్వీపదేశం అట్టుడుకుతోంది. ఇప్పటికే ఆందోళనకు బయపడి దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్స పారిపోయారు. రాజధాని కొలంబోలో అధ్యక్షభవనంతో పాటు సెక్రటేరియట్ను ముట్టడించారు నిరసనకారులు. ఇదిలా ఉంటే తాజాగా ప్రధాని పదవకి రణిల్ విక్రమసింఘే రాజీనామా చేశారు. శ్రీలంకలో నెలకొన్న తాజా పరిస్థితుల గురించి చర్చించేందుక అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు రణిల్. ఈ సమావేశానికి అధికార పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీలను కూడా ఆహ్వానించారు. ఈ సమావేశం అనంతరం ఆయన తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం చేయడానికే రాజీనామా చేస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.

Read Also: Kerala Lulu Mall: 50% డిస్కౌంట్.. సునామీలా దూసుకొచ్చిన జనం

మే నెలలో ఏర్పడిన తీవ్ర నిరసనల్లో భాగంగా అప్పటి ప్రధాని మహిందా రాజపక్స రాజీనామా చేశారు. దీంతో నాలుగు సార్లు ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న రణిల్ విక్రమసింఘేను ప్రధానిగా నియమిస్తూ అధ్యక్షుడు గోటబయ రాజపక్స నిర్ణయం తీసుకున్నారు. మే నెలలో ఆయన పదవీ బాధ్యతలను చేపట్టారు. సంక్షోభంలో ఉన్న శ్రీలంకను గట్టేక్కిస్తాడని భావించినప్పటికీ పరిస్థితులు మరింతగా దిగజారాయి. పెట్రోల్, నిత్యవసరాలకు రోజుల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజల్లో అసహనం కట్టలు తెంచుకుంది. శనివారం వేలాది మందిగా ప్రజలు కొలంబోలో ఆందోళనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో తన ప్రధాని పదవికి రణిల్ విక్రమసింఘే రాజీనామా చేశారు.

 

Exit mobile version