NTV Telugu Site icon

Srilanka Crisis: టీవీ ఛానల్‌లోకి దూసుకెళ్లిన ఆందోళన కారులు.. ప్రత్యక్షప్రసారాలు నిలిపివేత

Srilanka Crisis

Srilanka Crisis

సంక్షోభంలో కొట్టాడుతున్నస శ్రీలంకలో ప్రజాగ్రహం మరోసారి పెల్లుబికింది. జాతీయ రూపవాహిని అని పిలువబడే శ్రీలంక జాతీయ ప్రసార సంస్థ శ్రీలంక రూపవాహిని కార్పొరేషన్ ప్రాంగణాన్ని బుధవారం నిరసనకారులు చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యాజమాన్యంలోని శ్రీలంక రూపవాహిని కార్పొరేషన్ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసింది. చిక్కుల్లో పడిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణిల్ విక్రమసింఘేను నియమించినట్లు వార్తలు వెలువడ్డాయి. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం వీడారన్న విషయం తెలుసుకున్న ప్రజలు మండిపడుతున్నారు. శ్రీలంకలో నిరసనకారులు ప్రధాని ఇంట్లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించడంతో.. వారిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు నీటిఫిరంగులు, బాష్పవాయు గోళాలను ప్రయోగించాయి. పరిస్థితులు అదుపుతప్పేలా కనిపించడంతో శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితిప్రకటించింది. ప్రధాని నివాసం చుట్టూ ఎయిర్ పెట్రోలింగ్ కూడా ప్రారంభమైంది. రాజపక్స వెళ్లిపోవడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ఈ ప్రకటన చేశారు.

గొటబాయ రాజపక్స మాల్దీవులకు పారిపోయిన నేపథ్యంలో నిరసనలు తీవ్రం కావడంతో విక్రమసింఘే ఈరోజు ఎమర్జెన్సీని ప్రకటించి, దేశంలోని పశ్చిమ ప్రావిన్స్‌లో కర్ఫ్యూ విధించారు. ప్రధాని అధ్యక్షుడి అధికారాలను ఉపయోగించలేరని, కర్ఫ్యూ లేదా అత్యవసర పరిస్థితిని ప్రకటించలేరని శ్రీలంక ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస అన్నారు. “అధ్యక్షుడు నియమించినట్లయితే లేదా అధ్యక్షుడి పదవి ఖాళీగా ఉంటే లేదా స్పీకర్‌తో సంప్రదించి సీజే అధ్యక్షుడి పని చేయలేనని అభిప్రాయాన్ని తెలిపినప్పుడు మాత్రమే తాత్కాలిక రాష్ట్రపతి అవుతారని” ప్రేమదాస ట్వీట్ చేశారు. ఇవేవీ లేనప్పుడు, ప్రధానమంత్రి అధ్యక్షుడి అధికారాలను ఉపయోగించలేరని, కర్ఫ్యూ లేదా అత్యవసర పరిస్థితిని ప్రకటించలేరని ఆయన మరొక ట్వీట్‌లో తెలిపారు.

Rains-Memes: గ్యాప్‌ ఇవ్వరా.. కొంచెం. వరుణుడిపై నెటిజన్ల ఫ్రస్టేషన్‌.

కొలంబోలోని శ్రీలంక ప్రధాని నివాసంలోకి ప్రవేశించేందుకు గోడను ఎక్కిన నిరసనకారులను చెదరగొట్టేందుకు సైనిక సిబ్బంది టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. శ్రీలంక రక్షణ మంత్రిత్వ శాఖ పూర్తి ఆమోదం పొందిన తర్వాత గొటబాయ రాజపక్స తన భార్య, ఇద్దరు అంగరక్షకులతో కలిసి మాల్దీవులకు వెళ్లినట్లు శ్రీలంక అధికారులు ధ్రువీకరించారు. శ్రీలంక వైమానిక దళానికి చెందిన విమానంలో గొటబాయ మాలేలోని వెలనా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ధ్రువీకరించింది.

తనకు గొటబాయ నుండి రాజీనామా లేఖ ఇంకా అందలేదని శ్రీలంక పార్లమెంట్ స్పీకర్ మహింద యాపా అబేవర్దన అన్నారు. 73 ఏళ్ల గొటబాయ రాజపక్స జూలై 9న తన నివాసంపైకి నిరసనకారులు దాడి చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జులై 13న తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే.