NTV Telugu Site icon

Sri Lanka Economic Crisis: శ్రీలంక ప్రధాని కీలక నిర్ణయం

Ranil Wickremesinghe

Ranil Wickremesinghe

దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో శ్రీలంక ప్రధానిగా బాధ్యతలు అందుకున్న రణిల్ విక్రమసింఘే కీలక నిర్ణయం తీసుకున్నారు.. తన మంత్రివర్గంలోకి నలుగురిని చేర్చుకున్నారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడం కోసం ప్రభుత్వ ఏర్పాటును వేగవంతం చేశారు. ఆయన మంత్రివర్గంలో గరిష్ఠంగా 20 మంది మంత్రులు మాత్రమే ఉంటారని తెలుస్తోంది. పార్లమెంటులో ఆయన మెజారిటీని నిరూపించుకోవడానికి అధికార పార్టీ అయిన శ్రీలంక పొదుజన పెరమున సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మొత్తంగా.. జీఎల్ పెయిరిస్, దినేశ్ గుణవర్ధనే, ప్రసన్న రణతుంగ, కాంచన విజేశేకరలను తన కేబినెట్‌లో చేర్చుకున్నారు విక్రమసింఘే. ఇక, వారిలో పెయిరిస్‌కు విదేశాంగ శాఖ, దినేశ్‌కు ప్రభుత్వ పాలన, ప్రసన్నకు పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, కాంచనకు విద్యుత్తు, ఇంధనం శాఖలను అప్పగించారు ప్రధాని రణిల్‌ విక్రమసింఘే..

Read Also: House Fire: రెండో పెళ్లి చేసుకున్న భర్త.. మొదటి భార్య చేసిన పనికి నలుగురు బలి..