దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో శ్రీలంక ప్రధానిగా బాధ్యతలు అందుకున్న రణిల్ విక్రమసింఘే కీలక నిర్ణయం తీసుకున్నారు.. తన మంత్రివర్గంలోకి నలుగురిని చేర్చుకున్నారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడం కోసం ప్రభుత్వ ఏర్పాటును వేగవంతం చేశారు. ఆయన మంత్రివర్గంలో గరిష్ఠంగా 20 మంది మంత్రులు మాత్రమే ఉంటారని తెలుస్తోంది. పార్లమెంటులో ఆయన మెజారిటీని నిరూపించుకోవడానికి అధికార పార్టీ అయిన శ్రీలంక పొదుజన పెరమున సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మొత్తంగా.. జీఎల్ పెయిరిస్, దినేశ్ గుణవర్ధనే,…