NTV Telugu Site icon

Sri Lanka: రేపు శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు.. పోలింగ్‌కి సర్వం సిద్ధం

Srilankapresidentialpolls

Srilankapresidentialpolls

శనివారం శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం తర్వాత అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల చరిత్రలో తొలిసారి బరిలో 38 మంది అభ్యర్థులు ఉన్నారు. రణిల్‌ విక్రమసింఘే, సాజిత్‌ ప్రేమదాస, అనుర కుమార దిస్సనాయకే మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మొత్తం 1.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 13 వేల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫలితాలు మాత్రం ఆదివారం వెలువడనున్నాయి.

ఇది కూడా చదవండి: Delhi: పోలీసు అరెస్టును తప్పించుకోవడానికి ఫ్లైఓవర్ నుంచి దూకి నేరస్థుడు మృతి..

ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే(75) ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి త్వరగా కోలుకోవడంతో నిపుణుల నుంచి ప్రశంసలు పొందారు. ప్రస్తుం త్రిముఖ ఎన్నికల పోరు నెలకొంది. 1982 తర్వాత శ్రీలంక అధ్యక్ష ఎన్నికల చరిత్రలో త్రిముఖ పోటీ ఇదే తొలిసారి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2020 పార్లమెంటు ఎన్నికల్లో ముగ్గురు ప్రధాన పోటీదారులు ఎదురుదెబ్బలు చవిచూసినందున ఈ ఎన్నికలు గతంలో జరిగిన అన్ని అధ్యక్ష ఎన్నికల కంటే భిన్నమైనవి అని విశ్లేషకుడు కుసల్ పెరీరా తెలిపారు.

ఇది కూడా చదవండి: Pollution: షాకింగ్ న్యూస్.. కాలుష్యం వల్ల సంతాన లేమి సమస్య!

అనధికారిక ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఫ్రంట్ రన్నర్‌గా చెప్పబడుతున్న దిసానాయకే 2020 పార్లమెంట్ ఎన్నికలలో కేవలం మూడు శాతం ఓట్లను పోల్ చేయగా.. విక్రమసింఘే కేవలం 2 శాతం.. ప్రేమదాస 25 శాతం కంటే ఎక్కువ ఓట్లు మాత్రమే సాధించారు. 2022లో శ్రీలంక ఆర్థిక పతనంలో మునిగిపోవడంతో ప్రజా తిరుగుబాటు ద్వారా అప్పటి అధ్యక్షుడు గోటబయ రాజపక్సేను దేశం విడిచి పారిపోయేలా చేసింది.

దాదాపు 17 మిలియన్ నమోదిత ఓటర్లు ఈ ఎన్నికల్లో 13,400 పోలింగ్ స్టేషన్‌లలో ఓటు వేయడానికి అర్హులు. 80 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. పోల్ ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి.

ఇది కూడా చదవండి: Himachal : మసీదులో నమాజ్ చేయాలంటే గుర్తింపు కార్డు చూపించాల్సిందే