శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. ప్రజలు ఆకలితో అలమటించే పరిస్థితులు పొంచి ఉన్నాయనే వార్తలు లంక వాసులను కలవరపెడుతున్నాయి. నిత్యావసరాల కోసం షాపుల ముందు బారులు తీరారు. ఒక్క పాలపొడి ప్యాకెట్‌ను తీసుకునేందుకు గంటల తరబడి పడిగాపులు పడుతున్నారు. లంకలో ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. చమురు, గ్యాస్, ఔషధాలు, ఆహార కొరతతో పాటు విద్యుత్ కోతలు మరింత ఎక్కువయ్యాయి. ఇంధన ధరలు, నిత్యావసరాలు ఆకాశాన్ని తాకడంతో.. తినడానికి నానా అవస్థలు పడుతున్న జనం.. రాజపక్స ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రోడ్లెక్కి నిరసన తెలుపుతున్నారు. అయితే రాజీనామాకు ససేమిరా అంటున్నారు రాజపక్స. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.
Read Also: COVID 19: మళ్లీ కోవిడ్ టెన్షన్.. ఆ రాష్ట్రాలకు కేంద్రం వార్నింగ్..
ఇదే సమయంలో శ్రీలంకకు భారత్ ఆపన్న హస్తం అందిస్తోంది. ఇంధన సంక్షోభం నుంచి గట్టేక్కిచేందుకు 500 మిలియన్ డాలర్ల విలువైన చమురును లైన్ ఆఫ్ క్రెడిట్‌గా అందిస్తోంది. భారత్ నుంచి చమురు సాయం కొనసాగకపోతే.. ఏప్రిల్ నెలాఖరు నాటికి బంకులన్ని ఖాళీ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. అటు వేల టన్నుల బియ్యాన్ని కూడా శ్రీలంకకు పంపించింది ఇండియా. కాగా, ఆర్థిక సంక్షోభం కారణంగా.. అధ్యక్షుడు మరియు మొత్తం రాజపక్స కుటుంబం ప్రభుత్వం నుండి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతుండగా, ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస కూడా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్సీని రద్దు చేయాలని పిలుపునిచ్చారు, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ మరియు న్యాయవ్యవస్థ మధ్య అధికారాన్ని విభజించాలని అన్నారు. ఇంతలో, శ్రీలంక యొక్క సెంట్రల్ బ్యాంక్ శుక్రవారం తన కీలక వడ్డీ రేట్లను రెట్టింపు చేసింది. ఇంధనం, శక్తి, ఆహారం మరియు పెరుగుతున్న ఔషధం కొరతగా ఉంది. ఐదు రోజుల అత్యవసర పరిస్థితి మరియు రెండు రోజుల కర్ఫ్యూ ఉన్నప్పటికీ, వీధి నిరసనలు దాదాపు ఒక నెలకు పైగా నాన్‌స్టాప్‌గా జరుగుతూనే ఉన్నాయి.
