Site icon NTV Telugu

ఈ వ్యాక్సిన్‌.. డెల్టా వేరియంట్‌పై 83 శాతం సమర్థంగా..!

Sputnik V

Sputnik V

కరోనా మహమ్మారి రోజుకో కొత్త వైరస్‌లో వివిధ వేరియంట్లలో భయపెడుతూనే ఉంది.. ప్రస్తుతం అమెరికా, చైనా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది డెల్టా వేరియంట్‌.. అయితే, కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి తయారు చేసిన వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌పై ఎంత వరకు ప్రభావం చూపుతాయనే దానిపై పలు వాదనలు ఉన్నాయి.. కొన్ని అధ్యయనాల్లో.. అవి ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తాయి అనేది కూడా తేల్చాయి.. తాజాగా.. రష్యా తయారు చేసిన పై స్పుత్నిక్ వి.. కరోనా డెల్టా వేరియంట్‌పై ఎంత వరకు పనిచేస్తుందనేదానిపై పరిశోధనలు జరిగాయి.. ఈ వ్యాక్సిన్ 83 శాతం స‌మ‌ర్థంగా డెల్టా వేరియంట్‌పై పనిచేస్తున్నట్టు వెల్లడించారు ర‌ష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ ముర‌ష్కో.

మరోవైపు.. క‌రోనాలోని అన్ని వేరియంట్లపై కూడా త‌మ వ్యాక్సిన్ స‌మ‌ర్థంగా పనిచేస్తుందంటున్నారు స్పుత్నిక్ వి వ్యాక్సిన్ త‌యారీదారులు. తీవ్రమైన కోవిడ్ నుంచి ఈ వ్యాక్సిన్ 95 శాతం ర‌క్షణ క‌ల్పిస్తున్నట్లు కూడా చెబుతున్నారు.. క‌రోనా రాకుండా, డెల్టా వేరియంట్‌ను అడ్డుకోవ‌డంలో స్పుత్నిక్ వి స‌మ‌ర్థంగా ప‌ని చేస్తోందని ప్రకటించారు.. మొత్తంగా తాజా ఫ‌లితాలు డెల్టా వేరియంట్‌పై 83 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని తేల్చాయి. కాగా, ప్రపంచంలో క‌రోనా వైర‌స్‌ పై పోరాటంలో తొలి వ్యాక్సిన్‌గా స్పుత్నిక్ వి గుర్తింపు పొందింది.. ర‌ష్యాలో తయారైన ఈ వ్యాక్సిన్‌ను భారత్‌ సహా దాదాపు 50 దేశాల వరకు దిగుమతి చేసుకుంటున్నాయి.

Exit mobile version