NTV Telugu Site icon

South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ అరెస్ట్..

Korea

Korea

South Korea: దక్షిణ కొరియా దేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను కొరియన్ పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు విచారణ అధికారులు వెల్లడించారు. ఇక, ఈరోజు తెల్లవారుజామున సుమారు 3000 వేల మంది పోలీసులతో పాటు అవినీతి నిరోధక శాఖ అధికారులు యూన్ సుక్ యోల్‌ అరెస్ట్‌ చేసేందుకు వెళ్లగా.. అతడి తన వ్యక్తిగత భద్రతా దళాల వెనకకు వెళ్లి దాక్కోవడంతో యూన్ ను అతి కష్టం మీద అరెస్ట్ చేశారు. దీంతో యూన్ మద్దతుదారులతో పాటు అధికార పీపుల్ పవర్ పార్టీ సభ్యులు అధ్యక్ష భవనం దగ్గరకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అతనిని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలను నిరసించడంతో.. అక్కడ కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది.

Read Also: Jagganna Thota Prabhala Theertham: నేడు జగ్గన్నతోట ప్రభల తీర్థం.. భారీ ఏర్పాట్లు

అయితే, యూన్ సుక్ యోల్‌ మార్షల్ లా ప్రకటన దక్షిణ కొరియన్లను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్యాలలో ఒకటైన దక్షిణ కొరియాలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దీని వల్ల డిసెంబర్ 14న యూన్ పై అభిశంసన తీర్మనం ద్వారా అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించాలని చట్టసభ సభ్యులు ఓటు వేశారు. ఇక, రాజ్యాంగ న్యాయస్థానం ఆ అభిశంసనను సమర్థించడంతో.. అతనిని శాశ్వతంగా పదవి నుంచి తొలగించారు.

Show comments