NTV Telugu Site icon

South Korea President: నన్ను క్షమించండి.. మరోసారి దేశంలో ఎమర్జెన్సీ విధించను!

South Korea

South Korea

South Korea President: దేశంలో ఎమర్జెన్సీ విధించినందుకు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ స్పందించారు. ఈ సందర్భంగా తల వంచి అడుగుతున్నా.. నన్ను క్షమించండి.. మరోసారి దేశంలో ఎమర్జెన్సీ విధించనని దేశ ప్రజలను విజ్ఞప్తి చేశారు. మార్షల్‌ లా విధించి ప్రజల్లో భయాందోళనలు సృష్టించానని యోల్‌ తన తప్పును ఈ సందర్భంగా ఒప్పుకున్నారు. అయితే, ప్రభుత్వ పెద్దగా ఉన్న బాధ్యతతోనే ఎమర్జెన్సీ విధించానని వివరణ ఇచ్చారు. ఇక, దేశంలో ఎమర్జెన్సీ విధించినందుకు ఆ తర్వాత జరిగే న్యాయపరమైన విచారణ ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ పేర్కొన్నారు.

Read Also: Google Maps: గూగుల్ మ్యాప్స్ తెచ్చిన తంటా.. కర్ణాటక అడవుల్లో బీహార్ కుటుంబం

ఇక, ఇప్పటి నుంచి దేశ భవిష్యత్త్, తన భవిష్యత్తు తన పార్టీ నిర్ణయానికి వదిలేస్తున్నాన్నాని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తెలిపారు. దేశాన్ని పాలన విషయాన్ని తన పార్టీ, ప్రభుత్వం చూసుకుంటాయని చెప్పుకొచ్చారు. ఇలాంటి తప్పు మరోసారి చేయనని క్లారిటీ ఇచ్చారు. కాగా, యోల్‌పై మోపిన అభిశంసన తీర్మానంపై ఈ రోజు ( డిసెంబర్ 7) దక్షిణ కొరియా పార్లమెంట్‌లో ఓటింగ్‌ జరగబోతుంది. ఈ ఓటింగ్‌కు ముందు ఇవాళ ఓ టెలివిజన్‌ ఛానల్‌లో దక్షిణ కొరియా ప్రెసిడెంట్ యోల్ ప్రసంగిస్తూ బహిరంగ క్షమాపణ కోరడం గమనార్హం.