NTV Telugu Site icon

Dog Meat: శతాబ్ధాల సంప్రదాయం.. కుక్క మాంసం వినియోగానికి స్వస్తి చెప్పనున్న ఆ దేశం..

South Korea

South Korea

Dog Meat: శతాబ్ధాలుగా వస్తున్న సంప్రదాయానికి దక్షిణ కొరియా స్వస్తి పలకనుంది. కొన్నేళ్లుగా దక్షిణ కొరియాలోని ప్రజలు కుక్క మాంసాన్ని తింటున్నారు. అయితే ఈ విధానానికి అడ్డుకట్ట వేసేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దేశంలోని అధికార పీపుల్ పవర్ పార్టీ ఈ ఏడాది చివరి నాటికి కుక్క మాంసం వినియోగంపై నిషేధాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. కుక్క మాంసం వినియోగంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, ముఖ్యంగా యువతరాల్లో ఈ సెంటిమెంట్ ఎక్కువగా ఉంది. అలాగే జంతు హక్కుల సంఘాల నుంచి అంతర్జాతీయంగా విమర్శలు రావడం కూడా దక్షిణ కొరియా నిర్ణయానికి కారణమవుతోంది.

ప్రతిపాదిన నిషేధం మూడు ఏళ్ల గ్రేస్ పిరియడ్‌ని కలిగి ఉంది. కుక్క మాంసం వ్యాపారం నుంచి బయటపడేందుకు అక్కడి వ్యాపారులకు ఆర్థిక సాయం కూడా అందిచనుంది. ఈ నిర్ణయంపై కుక్క మాంసం వినియోగంపై కొరియా ప్రజల వ్యతిరేకత ఎలా ఉందో చెబుతోంది.
కుక్క మాంసాన్ని కొన్ని శతాబ్ధాలుగా కొరియన్ ప్రజలు ఆహారంగా తీసుకుంటున్నారు. అయితే ఇది క్రూరమైన చర్యగా అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం సౌత్ కొరియాలోని యువతరం కుక్క మాంసం వినియోగానికి దూరంగా ఉంటున్నారు.

Read Also: Delhi: వరల్డ్ కప్ ఫైనల్ రోజున మందుబాబులకు షాకిచ్చిన ప్రభుత్వం.. కారణం ఇదే..

ఈ మేరకు ప్రభుత్వ అధికారులతో జరిగిన సమావేశంలో అధికా పీపుల్ పవర్ పార్టీ పాలీస చీఫ్ యు ఇయు-డాంగ్ మాట్లాడుతూ.. కుక్క మాంసం వినియోగానికి సంబంధించి సామాజిక సంఘర్షణ, వివాదానికి ముగింపు పలికేందుకు కొత్త చట్టం తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. జంతు హక్కుల కార్యకర్తలతో, ప్రబుత్వ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ భార్య, ఫస్ట్ లేడీ అయిన కిమ్ కియోన్ హీ కుక్క మాంసం వినియోగానికి తీవ్ర విమర్శకులురాలు. ఆమె, తన భర్తతో కలిసి వీధి కుక్కల్ని దత్తతీ తీసుకున్నారు. అయితే గతంలో ఈ పరిశ్రమలో ఉన్నవారు, రెస్టారెంట్ల యజమానుల జీవనోపాధి గురించి ఆందోళన కారణంగా కుక్క మాంసం వ్యతిరేక బిల్లులు తీసుకురావడంలో విఫలయమ్యారు. కొరియన్ ద్వీపకల్పంలో కుక్క మాంసాన్ని తినడం పురాతనంగా వస్తున్న సంప్రదాయం. వేసవిలో వేడిని అధిగమించేందుకు ఈ మాంసాన్ని తీసుకోవడం సంప్రదాయంగా భావించబడుతోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం కుక్కల పెంపకం కోసం 1150 కేంద్రాలు ఉన్నాయి, వీటిని వధించేందుకు 34 కేంద్రాలు, 219 పంపిణీ కేంద్రాలు, 1600 రెస్టారెంట్లు ఉన్నాయి. గతేడాది కుక్కమాంసానికి వ్యతిరేకంగా పెట్టిన పోల్ లో 64 శాతం మంది కుక్కమాంసాన్ని వ్యతిరేకించారు.