Site icon NTV Telugu

Ukraine Crisis: ఉక్రెయిన్‌కు ప‌లు విమానాలు ర‌ద్దు…

ఉక్రెయిన్‌లో ప‌రిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి. ర‌ష్యాకు స‌మీపంలో ఉన్న బెలార‌స్‌లో ర‌ష్యా సైన్యాన్ని భారీగా మోహ‌రిస్తున్న‌ది. మ‌రోవైపు ర‌ష్యా స‌ముద్ర‌జ‌లాల్లో లైవ్ వార్ ట్ర‌య‌ల్స్‌ను నిర్వ‌హిస్తున్న‌ది. ర‌ష్యా, అమెరికా మ‌ధ్య అనేక ద‌ఫాలుగా చ‌ర్చ‌లు జ‌రిగాయి. పుతిన్‌, జో బైడెన్‌లు అనేక‌మార్లు టెలిఫోన్ ద్వారా మాట్లాడుకున్నారు. కూర్చొని మాట్లాడుకుంటే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని జో బైడెన్ పుతిన్‌కు చెప్పిన‌ట్టు స‌మాచారం.

Read: Medaram Jathara: స‌మ్మ‌క్క సార‌క్క జాత‌ర గురించి ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోవాలి…

తాము ఉక్రెయిన్‌పై సైనిక చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని అంటూనే సైన్యాన్ని మోహ‌రిస్తుండ‌టంతో అమెరికాతో పాటు ప‌లుదేశాలు ఉక్రెయిన్‌లోని రాయ‌బార కార్యాల‌యాల‌ను మూసేస్తున్నాయి. వివిధ దేశాలు పౌరుల‌ను వెన‌క్కి వ‌చ్చేయ్యాల‌ని ఆదేశాలు జారీ చేశాయి. ఇక చాలా దేశాలు ఉక్రెయిన్‌కు వెళ్లాల్సిన విమానాల‌ను ర‌ద్దు చేశాయి. కొన్నింటిని దారిమ‌ళ్లించాయి. ఫిబ్ర‌వ‌రి 16 వ తేదీన ర‌ష్యా దాడుల‌కు దిగే అవ‌కాశం ఉన్న‌ట్టు త‌మ వ‌ద్ద స్ప‌ష్ట‌మైన స‌మాచారం ఉంద‌ని, దాడికి దిగితే ఆర్థిక‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అమెరికా హెచ్చ‌రిస్తున్న‌ది.

Exit mobile version