NTV Telugu Site icon

London School of Economics: భారతీయుడు-హిందూ అంటే ద్వేషం.. ఓ స్టూడెంట్ ఆవేదన

Karan Kataria

Karan Kataria

London School of Economics: లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్(ఎల్ఎస్ఇ)లో భారత, హిందూ వ్యతిరేక దుష్ఫ్రచారం జరుగుందని ఆరోపిస్తూ ఓ భారతీయ విద్యార్థి తన ఆవేదన వ్యక్తం చేశారు. తాను భారతీయుడు అయినందు వల్లే తానను స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో పాల్గొనకుండా చేశారని పేర్కొన్నాడు. హర్యానాకు చెందిన కరణ్ కటారియా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుమేట్ విద్యను అభ్యసిస్తున్నాడు. ఇటీవల తాను ఎల్ఎస్ఇ స్టూడెంట్ యూనియన్(ఎల్ఎస్ఇఎస్యూ) జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేయడానికి తన సహచర విద్యార్థులు సపోర్టు చేశారని అయితే తనపై నిరాధారమైన ఆరోపణల కారణంగా సస్పెన్షన్ వేటు వేశారని, తన వివరణ ఇచ్చేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని కటారియా పేర్కొన్నాడు.

Read Also: Anti-India agenda: రామనవమి హింసపై ముస్లిం దేశాల కూటమి ప్రేలాపన.. తీవ్రంగా స్పందించిన భారత్..

ఓ భారతీయ హిందువు ఎల్ఎస్ఈఎస్యూకి నాయకత్వం వహించడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారని, నా మూలాలు తెలిసే తనను పోటీలో నిలబడేందుకు అనర్హుడిగా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సంక్షేమం కోసం తాను చాలా ఆలోచించానని, కానీ భారతీయ హిందూ అనే ఒకే ఒక్క కారణంతో తనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారని తెలిపారు. 22 ఏళ్ల కటారియా తాను మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినట్లు, తన కుటుంబంలో తాను మొదటి తరం విద్యవిద్యాలయం గ్రాడ్యుయేట్ అని తెలిపారు.

అన్ని దేశాల విద్యార్థుల నుంచి తనకు సపోర్టు లభించినప్పటకీ.. స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఎన్నికలకు అనర్హుడిని అయ్యానని, స్వలింగ సంపర్కం, ఇస్లామోఫోబియా, హిందూ జాతీయవాది అనే నిరాధారమైన ఆరోపనలతో నాకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రచారాన్ని ప్రారంభించారని అన్నారు. ఈ ఎన్నికల్లో భారతీయ విద్యార్థులను బెదిరించినట్లు ఫిర్యాదు చేసినా యూనివర్సిటీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కటారియా అన్నారు. దీనిపై లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ స్పందించింది. అంతా ప్రజాస్వామ్యబద్ధంగానే జరిగినట్లు తెలిపింది. కటారియా నిబంధనలు ఉల్లంఘించిన కారణంగానే ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేయకుండా అనర్హత వేశామని సమర్థించుకుంది.