ప్రపంచాన్ని ప్రకృతి విపత్తులు అనేకం ఇబ్బందులు పెడుతున్నాయి. కరోనాతో ఇప్పటికే నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు మరో షాకింగ్ న్యూస్ చెప్పింది నాసా. సూర్యుడి నుంచి సౌర తుఫాన్ దూసుకొస్తున్నదని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈనెల 3 వ తేదీన దీనిని గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని అలర్ట్ చేశారు. ఈ సౌర తుఫాన్ గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్నదని, ఆ వేగం మరింతగా పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు హెచ్చరించారు. ఈ సౌర తుఫాన్ శాటిలైట్ వ్వవస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉందని, జీపీఎస్, నావిగేషన్ వ్యవస్థ, మొబైల్ ఫోన్ సిగ్నల్స్, శాటిలైట్ టీవీ వంటి వ్యవస్థలపై ప్రభావం చూపుతుందని, సమాచార వ్యవస్థకు అంతరాయం కలిగే అవకాశం ఉండొచ్చని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
డేంజర్ బెల్స్ః దూసుకొస్తున్న సౌర తుఫాన్… సమాచార వ్యవస్థకు…
