జగన్ కు రాజకీయ బిక్ష పెట్టింది రాయలసీమ ప్రజలే…

మదనపల్లె పర్యటనలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రా సీఎంలు కలసి బోంచేసి ముద్దులు పెట్టుకోవడం కాదు. ఇద్దరు కలసి కర్ణాటక లోని అల్ మట్టి, మహారాష్ట్ర లోని బీమా నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోండి. అక్కడ డ్యామ్ లు కడితే కృష్ణా నది ఎడారిగా మారుతుంది అన్నారు. సీఎం జగన్ కు రాజకీయ బిక్ష పెట్టింది రాయలసీమ ప్రజలే అని… అలాంటి రాయలసీమకు కృష్ణా జలాల కోసం జగన్, కేసీఆర్ తో రాజీపడటం సబబు కాదు. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం ఎడమ కాలువపై 810 అడుగులకే జల విద్యుత్ తయారు చేస్తూ, కృష్ణా జలలాను సముద్రంలోకి వదిలేస్తుంటే జగన్ చూస్తూ వూరుకున్నాడు.,అపెక్స్ కౌన్సిల్ కు వ్యతిరేకంగా తెలంగాణ వ్యవహరిస్తున్నా ఎమ్మెల్యేలు, ఎంపీలు నిమ్మకునీరెత్తి సైలెంట్ గా ఉన్నారు అని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-