Sicily travel alert: యూరప్‌లోని అతిపెద్ద యాక్టివ్ అగ్ని పర్వతం అయిన మౌంట్ ఎట్నా శుక్రవారం విస్ఫోటనం చెందింది. ఈ పేలుడు ధాటికి ఆకాశంలోకి ఒక్కసారిగా ఆగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ చుట్టు పక్కాల ప్రాంతాలపై మొత్తం బూడిద వ్యాపించింది. కాగా, ఈ బూడిద దెబ్బకు ఇటలీలోని కాటానియా ఎయిర్ పోర్టును మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పాడింది. విమాన ప్రయాణానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. అగ్నిపర్వతం నుంచి ఎగిసిన పడిన బూడిద వల్ల కాటానియా విమానాశ్రయంలోని రన్‌వే పూర్తిగా నిరుపయోగంగా మారిపోయింది. వచ్చే- పోయే విమానాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి అని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Read Also: Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి వారాహి ఉత్సవాలు, సారె మహోత్సవాలు..
కాగా, ఇటలీకి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియోఫిజిక్స్ అండ్ వాల్కనాలజీ ఆకాశంలో 4.5 కిలో మీటర్ల ఎత్తుకు బూడిద ఎగిసిపడింది అని తెలిపింది. సోషల్ మీడియాలో షేర్ చేయబడిన అగ్ని పర్వతం యొక్క వీడియోలో.. కాటానియా నగరంలోని రోడ్లు నల్ల బూడిదతో కప్పబడి ఉన్నాయి.. దీని కారణంగా నగరంలోని ట్రాఫిక్ పై దీని ప్రభావం చూపించింది. ఎట్నా పర్వతం ఎత్తు 3, 324 మీటర్లు (10,905 అడుగులు) ఉంటుంది. మౌంట్ ఎట్నా దగ్గర ఉన్న అగ్నిపర్వతం ఇటీవలి సంవత్సరాలలో చాలాసార్లు బద్దలైపోయింది