Site icon NTV Telugu

US: మెక్సికోలో కాల్పులు.. 12 మంది మృతి

Usfire

Usfire

అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. మెక్సికోలో జరుగుతున్న వేడుకలపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. 12 మంది చనిపోగా.. మరో 20 మంది గాయపడ్డారు. దీంతో ఉత్సాహంగా జరుగుతున్న వేడుకలు.. ఒక్కసారిగా విషాదంగా మారాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Iran Supreme Leader: ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడ.. వేరే దేశానికి మకాం మార్చే ఛాన్స్..?

మెక్సికోలోని గ్వానాజువాటోలోని ఇరాపువాటోలో సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ గౌరవార్థం ఒక ఇంటి సమీపంలో వేడుకలు జరుగుతున్నాయి. స్థానికులు మద్యం సేవించి నృత్యం చేశారు. బ్యాండ్ వాయిస్తుండగా అందుకు తగ్గట్టుగా డ్యాన్స్‌లు చేశారు. అందరూ ఉత్సాహంగా నృత్యం చేస్తుండగా దుండగులు ప్రవేశించి కాల్పులకు తెగబడ్డారు. సంఘటనాస్థలిలోనే 12 మంది మృత్యువాత పడ్డారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనను మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ తీవ్రంగా ఖండించారు. ఇది చాలా దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.

ఇది కూడా చదవండి: Kanaka Durgamma: నేటి నుంచి ఇంద్రకిలాద్రిపై వారహి నవరాత్రులు, ఆషాఢ సారె సమర్పణ ఉత్సవాలు!

మెక్సికో అత్యంత హింసాత్మక రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. ఇక్కడ నేరస్థులు మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా ద్వారా తరలిస్తుంటారు. ఇంకోవైపు అధికారులు దాడులు చేస్తూనే ఉంటారు. మరోవైపు రవాణా జరుగుతూనే ఉంటుంది. ఈ ఏడాదిలోని మొదటి ఐదు నెలల్లో 1,435 మంది హత్యకు గురైనట్లు రికార్డుల్లో నమోదైంది. ఏ రాష్ట్రంలో లేని హత్యలు.. మెక్సికోలోనే ఎక్కువగా నమోదవ్వడం విశేషం. ఇదిలా ఉంటే గత నెలలో గ్వానాజువాటోలో శాన్ బార్టోలో డి బెర్రియోస్ పట్టణంలో జరిగిన కాథలిక్ చర్చి కార్యక్రమంలో ఏడుగురు వ్యక్తులు మరణించారు. అనంతరం బుధవారం ఇలాంటి విషాదమే చోటుచేసుకుంది.

Exit mobile version