Site icon NTV Telugu

Austria school shooting: ఆస్ట్రియా స్కూల్‌లో ఉన్మాది కాల్పులు.. 8 మంది మృతి..

Austria School Shooting

Austria School Shooting

Austria school shooting: యూరోపియన్ దేశం ఆస్ట్రియాలో ఓ ఉన్మాది నరమేధం సృష్టించాడు. గ్రాజ్‌లోని ఒక స్కూల్‌లో జరిపిన కాల్పుల్లో కనీసం 8 మంది మరణించగా, చాలా మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అనుమానితుడు విద్యార్థి అని తెలుస్తోంది. ఘటన తర్వాత నిందితుడు వాష్ రూంలో ఆత్మహత్య చేసుకుని కనిపించాడని ఆస్ట్రియన్ స్టేట్ మీడియా ఓఆర్ఎఫ్‌ని ఉటంకిస్తూ యూకేకి చెందిన ఇండిపెండెంట్ నివేదించింది. అయితే, అధికారుల నుంచి ఇంకా ధ్రువీకరణ రావాల్సి ఉంది.

Read Also: US Embassy: “అలాంటి వారు అమెరికాకు వచ్చే హక్కు లేదు”.. భారతీయ విద్యార్థికి సంకెళ్లపై వివరణ..

పాఠశాలలో కాల్పుల శబ్ధం వినిపించిన తర్వాత ఉదయం 10 గంటల నుంచి నగరంలో ఒక పెద్ద ఆపరేషన్ జరుగుతోందని పోలీసులు తెలిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వారిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. కాల్పుల తర్వాత పోలీసులు సంఘటన స్థలానికి వేగంగా వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సెకండరీ స్కూల్ ఉన్న ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతోంది. అధికారులు భవనాన్ని చుట్టుముట్టి సోదాలు నిర్వహిస్తున్నారు. జూన్ 20, 2015న జరిగిన గ్రాజ్ కాల్పులకు పదేళ్ల వార్షికోత్సవానికి ముందు ఈ కాల్పులు జరిగాయి, ఆ సమయంలో కాల్పుల్లో ముగ్గురు మరణించారు.

Exit mobile version