Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రెండేళ్ల తర్వాత తొలిసారిగా మౌనం వీడారు. తొలిసారిగా బహిరంగంగా ఆమె మాట్లాడారు. 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్ విడిచి భారత్ వచ్చిన ఆమె న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ ప్రసంగం సందర్భంగా ఆమె చాలా సార్లు కన్నీరు పెట్టుకున్నారు. షేక్ హసీనా తర్వాత పాలనాధికారం చేపట్టిన తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్‌పై తీవ్ర ఆరోపణలు చేుశారు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ముందే పక్కా ప్రణాళికను రూపొందించినట్లు ఆరోపించారు. ఈ కుట్ర నిజాన్ని మహ్మద్ యూనసే స్వయంగా బయటపెట్టారని అన్నారు.
బంగ్లాదేశ్‌లో జరిగిందిన విద్యార్థుల స్వచ్ఛంద ఉద్యమం కాదని, ముందే రూపొందించిన ప్రభుత్వ మార్పు(రెజిమ్ ఛేంజ్) కుట్ర అని ఆరోపించారు. రిజర్వేషన్ కోటా ఉద్యమాన్ని తనను అధికారంలో నుంచి తొలగించేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మార్చి తనను అధికారంలో నుంచి తొలగించే ఉద్యమంగా మార్చారని ఆరోపించారు. ఉద్యమం మొదటి నుంచే శాంతియుతంగా లేదని హసీనా పేర్కొన్నారు. ప్రభుత్వం హైకోర్టు కోటా తీర్పుపై అప్పీల్ చేసిందని, విద్యార్థి నాయకులతో చర్చలకు సిద్ధమైందని కూడా ఆమె చెప్పారు. కొన్ని గుంపులు ఈ ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చి, ఎన్నికైన ప్రభుత్వాన్ని గద్దె దించారని ఆరోపించారు.
2024 అల్లర్ల సమయంలో 450కి పైగా పోలీస్ స్టేషన్లకు నిప్పు పెట్టారని, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేశారని, పలువురు పోలీస్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఆమె ఆరోపించారు. తన ప్రసంగంలో 1975లో తన కుటుంబ సభ్యుల హత్యను గుర్తు చేసుకుంటూ హసీనా భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్‌తో పాటు 1971విమోచన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళలర్పించారు.
ఇప్పుడున్న బంగ్లాదేశ్ తాము సృష్టించింది కాదని, గత రెండేళ్లుగా బంగ్లాదేశ్‌లో కష్టాలు పెరిగాయని అన్నారు. తాను దేశానికి దూరంగా ఉన్నా, ప్రజలకు ఎన్నడూ దూరంగా లేనని, తన కుటుంబం బంగ్లాదేశ్ కోసం పోరాడిందని చెప్పారు. మహ్మద్ యూనస్ పోలీసుల్ని చంపిన హంతకులకు క్షమాభిక్ష ప్రసాదించారని చెప్పారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీ వర్గాలపై దాడులు, న్యాయమూర్తులపై దాడులు చేశారని ఆమె అన్నారు.

