Sheikh Hasina: ‘మరణం రాసి ఉంటే నా దేశంలోనే చనిపోతా’.. కొత్త పాస్‌పోర్ట్, NID కోసం షేక్ హసీనా దరఖాస్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina’s Bangladesh Return Plan: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లో స్వీయ ప్రవాసంలో ఉన్న ఆమె బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లేందుకు కొత్త పాస్‌పోర్ట్‌తో పాటు నేషనల్ ఐడెంటిటీ కార్డు (NID) జారీ చేయాలని అధికారికంగా కోరారు. ఈ పరిణామం ఆమె డిసెంబర్లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలనే ప్రణాళికకు స్పష్టమైన సంకేతంగా భావిస్తున్నారు. షేక్ హసీనా తరఫు న్యాయవాదులు ఢిల్లీలోని బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయం తాత్కాలిక హైకమిషనర్ ప్రీతి రహ్మాన్‌కు లేఖ రాశారు. లండన్‌కు చెందిన మ్యాట్రిక్స్ చాంబర్స్ న్యాయవాదులు కొత్త బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్, జాతీయ గుర్తింపు కార్డు జారీ చేయాలని కోరినట్లు రాయిటర్స్ నివేదించింది.
హసీనా వద్ద ఉన్న ప్రస్తుత పాస్‌పోర్ట్, NIDలను అప్పటి మధ్యంతర ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులు రద్దు చేసినట్లు వచ్చిన సమాచారం నేపథ్యంలో కొత్త పత్రాలు జారీ చేయాలని న్యాయవాదులు కోరారు. ఆమె బంగ్లాదేశ్ పౌరసత్వాన్ని ప్రస్తావిస్తూ, అంతర్జాతీయ మానవ హక్కుల బాధ్యతలకు అనుగుణంగా దరఖాస్తును త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read
- Nvidia CEO Controversy: 'నేను నా భార్యకు ద్రోహం చేశాను,'.. చైనా గూఢచారితో వివాహేతర సంబంధం నిజమేనన్న ఎన్విడియా సీఈఓ
- Pete Hegseth: ‘పీట్ హెగ్సెత్ దిగిపోవాల్సిందే’.. ట్రంప్ ప్రభుత్వానికి డెమోక్రాట్ల షాక్.. అభిశంసనకు సిద్ధం!
- Iran Nuclear Talks: ఇరాన్‌పై మళ్లీ అమెరికా దాడులు?.. అణు చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Eisenkot: ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం.. ప్రభుత్వం ఏర్పాటుకు ఐసన్కోట్కు ఆహ్వానం..
కోర్టు ముందు లొంగిపోవడానికి సిద్ధం
బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లిన తర్వాత కోర్టు ముందు లొంగిపోవాలని షేక్ హసీనా భావిస్తున్నట్లు ఆమె గతంలో వెల్లడించారు. అవసరమైన అధికారిక ప్రక్రియలు పూర్తయిన తర్వాతే తిరుగు ప్రయాణానికి సంబంధించిన ఖచ్చితమైన తేదీని ప్రకటిస్తామని ఆమె సహాయకులు తెలిపారు.
‘నా దేశంలోనే చనిపోవాలని కోరుకుంటున్నా’
ఇటీవల అసోసియేటెడ్ ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హసీనా తన స్వదేశానికి తిరిగి వెళ్లాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి ప్రమాదం ఎదురైనా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. “మరణం నా రాతలో ఉంటే, నా సొంత దేశంలో, నా ప్రజల మధ్యే ఉండాలని కోరుకుంటాను” అని ఆమె భావాన్ని వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో తనపై ఉన్న ఆరోపణలను హసీనా ఖండిస్తున్నారు. తనపై జరిగిన న్యాయ ప్రక్రియ చట్టబద్ధతను కూడా ఆమె ప్రశ్నిస్తున్నారు.
షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ఒకప్పుడు బంగ్లాదేశ్‌లో అతిపెద్ద రాజకీయ పార్టీల్లో ఒకటిగా ఉండేది. అయితే ఆమె అధికారం నుంచి తప్పుకున్న తర్వాత పార్టీపై నిషేధం విధించారు. పార్టీకి చెందిన పలువురు నాయకులు జైలుకు వెళ్లగా, మరికొందరు భారత్‌తో పాటు ఇతర దేశాల్లో స్వీయ ప్రవాసంలో ఉన్నారు. షేక్ హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి రావడం దేశ రాజకీయాల్లో మరోసారి భారీ చర్చకు దారితీయవచ్చు. ఆమెపై ఉన్న న్యాయపరమైన కేసులు, అవామీ లీగ్‌పై నిషేధం, భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు వంటి అంశాల నేపథ్యంలో ఆమె తిరుగు ప్రయాణం కీలకంగా మారింది.
తాజావార్తలు
-
Sheikh Hasina: ‘మరణం రాసి ఉంటే నా దేశంలోనే చనిపోతా’.. కొత్త పాస్‌పోర్ట్, NID కోసం షేక్ హసీనా దరఖాస్తు
-
Diwali: దీపావళి గాయాలు.. ఆస్పత్రులకు తెలుగు రాష్ట్రాలు క్యూ..!
-
Fire Accidents: రాష్ట్రంలో వరుస అగ్నిప్రమాదాలు.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం!
-
ECB: క్రికెట్‌కు పుట్టినిల్లయిన ఇంగ్లాండ్‌కు గడ్డుకాలం.. రూ. 627 కోట్ల భారీ నష్టంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు..!
-
Penugonda Farmers: తుఫాన్ల దెబ్బకు తోడు ముంపు కష్టాలు.. పెనుగొండలో రోడ్డెక్కిన రైతులు!
ట్రెండింగ్
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!