Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్ 16న స్వదేశానికి తిరిగి వెళ్తున్నారు. రెండేళ్లుగా భారత్లో నివసిస్తున్న ఆమె బంగ్లాదేశ్ వెళ్తున్నట్లు ఆమె అధికార ప్రతినిధి మంగళవారం ప్రకటించారు. హసీనా వస్తుండటంతో ఆమె పార్టీ అవామీలీగ్ సంబరాలు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో 16న బంగ్లా జాతీయ రహదారుల్ని ఆక్రమిస్తామని ప్రకటించింది. ఆమెను ప్రజానాయకురాలిగా అభివర్ణిస్తూ అవామీలీగ్ ఫేస్బుక్లో కీలక ప్రకటన చేసింది.
డిసెంబర్ 16నే బంగ్లాదేవ్ 1971 విమోచనయుద్ధ విజయ వార్షికోత్సవం, ఆ రోజునే స్వదేశానికి వెళ్లేందుకు షేక్ హసీనా ఎంచుకున్నారు . హసీనా బంగ్లా వస్తుండటంతో ఇప్పటికే ఆ దేశంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇది రాజకీయ, న్యాయపరమైన ఉద్రిక్తతలకు కారణమయ్యే అవకాశం ఉంది. షేక్ హసీనా తన పత్రాలను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడమే కాకుండా, ప్రభుత్వ యాజమాన్యంలోని విమాన సంస్థ బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్లైన్స్ ద్వారా తిరిగి రావడానికి ఏర్పాట్లు చేయాలని బంగ్లాద్ ప్రభుత్వాన్ని కోరారు.
మరోవైపు, షేక్ హసీనా రాకపై అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ), ఆ పార్టీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. బంగ్లాదేశ్ విదేశాంగ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ మాట్లాడుతూ.. షేక్ హసీనా చేతులకు సంకెళ్లు వేసి, కట్టుదిట్టమైన భద్రత నడుమ బంగ్లాదేశ్ తీసుకువస్తామని అన్నారు.
2024లో హింసాత్మక ఉద్యమం తర్వాత షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ వచ్చారు. ఈ హింసలో 1400 మంది మరణించారు. గతేడాది నవంబర్లో బంగ్లాదేశ్ యుద్ధ నేరాల న్యాయస్థానం హసీనాకు మరణశిక్ష విధించింది. ఆమె మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణల్ని హసీనా ఖండించారు.

