Site icon NTV Telugu

Shashi Tharoor: శశి థరూర్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం

Shashi Tharoor

Shashi Tharoor

Shashi Tharoor: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం షెవాలియర్ డి లా లెజియన్ డి’హోన్నూర్‌ను ఆ దేశం ప్రకటించింది. ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కడంపై పార్టీ నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.అతని రచనలు, ప్రసంగాలకు ఫ్రెంచ్ ప్రభుత్వం అతన్ని సత్కరిస్తోంది. ఇక్కడి ఫ్రెంచ్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్ ఈ అవార్డు గురించి థరూర్‌కు లేఖ రాశారు. ఫ్రెంచ్ మంత్రి ఎవరైనా భారత పర్యటనకు వచ్చినప్పుడు ఈ అవార్డును అందించనున్నారు. విశిష్టమైన పౌర లేదా సైనిక ప్రతిభను చూపినవారికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. 1802లో నెపోలియన్ బోనపార్టీ ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. రచనలు, ప్రసంగాల్లో ప్రతిభకు గుర్తింపుగా దీనిని శశి థరూర్‌కు ఇస్తున్నారు.

Arvind Kejriwal: ధనవంతులకు రుణమాఫీలు, పేదవాడిపై పన్నుల భారం.. కేంద్రంపై కేజ్రీవాల్ విమర్శలు

‘‘ఫ్రాన్స్‌తో మన సంబంధాల పట్ల సంతోషించేవారిలో, ఫ్రెంచ్ భాషను ప్రేమించేవారిలో, ఆ సంస్కృతిని ఇష్టపడేవారిలో ఒక వ్యక్తిగా నన్ను ఈ విధంగా గుర్తించడం గౌరవప్రదంగా భావిస్తున్నాను. ఈ విశిష్టతను ప్రదానం చేయడానికి నేను తగిన వ్యక్తినని భావించినవారందరికీ నా కృతజ్ఞతలు, వారిపట్ల నా గౌరవ భావాన్ని ప్రకటిస్తున్నాను’’ ట్విట్టర్‌లో శశి థరూర్ వెల్లడించారు. శశి థరూర్‌కు పలువురు కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ కేరళ యూనిట్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సభ్యులు కూడా శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version