Site icon NTV Telugu

Sharia law: అమెరికన్లపై బలవంతంగా “షరియా చట్టాన్ని” ప్రయోగిస్తారు..యూఎస్ ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు..

Chip Roy

Chip Roy

Sharia law: అమెరికా చట్టసభ సభ్యుడు చిప్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్ హౌజ్ ఫ్లోర్‌లో మాట్లాడుతూ..అమెరికన్ సమాజంపై ‘‘షరియా చట్టాన్ని’’ విధించే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం చేశారు. సరిహద్దు భద్రత, విదేశాల సహాయం గురించి తన ఆందోళనల్ని వ్యక్తపరిచారు. షరియా చట్టం గురించి తనకు భయాందోళనలు ఉన్నాయని, ఇది అమెరికన్ ప్రజలపై విధిస్తారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల యునైడెట్ కింగ్‌డమ్(యూకే)లో పెరుగుతున్న ముస్లిం ఆధిపత్యాన్ని ప్రస్తావించారు. ఇటీవల ఇంగ్లాండ్ లీడ్స్‌లో కొత్తగా కౌన్సిల్ సభ్యుడి గెలిచిన మోతిన్ అలీని ప్రస్తావిస్తూ.. యూకే ముస్లిం స్వాధీనంగా అభివర్ణించారు. అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు చేస్తూ తన విజయాన్ని జరుపుకోవడాన్ని ప్రస్తావించారు. వారిని ఇజ్రాయిల్ విరోధులుగా అభివర్ణించారు.

Read Also: Megastar Chiranjeevi : చిరంజీవికి పద్మ విభూషణ్.. భార్యతో ఢిల్లీలో ల్యాండయిన రామ్ చరణ్

చిప్ రాయ్ పాలస్తీనా వ్యతిరేకుడి ప్రసిద్ధి చెందారు. ఇటీవల యూఎస్ వ్యాప్తంగా పలు యూనివర్సిటీల్లో పాలస్తీనా అనుకూల, ఇజ్రాయిల్ వ్యతిరేక నిరసనల్ని బహిరంగంగానే విమర్శించారు. ఈ నిరసనల నేపథ్యంలో మన పిల్లల మనసులను విషపూరితం చేస్తున్న ఎలైట్ సంస్థలకు నిధులు నిలిపయాలని ఆయన కోరారు. కఠినమైన ఇమ్మిగ్రేషన్ కోసం వాదించడంతో పాటు కఠినమైన సరిహద్దు నియంత్రణ ఉండాలని సూచించాడు. విదేశాల్లో జన్మించిన చాలా మంది జనాభా యూఎస్‌లో ఉండటంపై ఆందోళన లేవనెత్తారు. ఇది వెస్ట్రన్ విలువలకు ముప్పు కలిగిస్తుందని సూచించారు. విదేశాల్లో జన్మించిన 51.5 మిలియన్ల జనాభా ప్రస్తుతం యూఎస్‌లో ఉన్నట్లు, వారికి దాదాపు 20-25 మిలియన్ల మంది పిల్లలు ఉన్నారని చెప్పారు. మొత్తం జనాభాలో 20 శాతం కంటే ఎక్కువ మంది ఉన్నరని అన్నారు. అయితే, రాయ్ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు జాతీయ భద్రత, ఇమ్మిగ్రేషన్ సమస్యలపై ప్రశంసిస్తుండగా.. మరికొందరు ఇస్లామోఫోబియాగా విమర్శిస్తున్నారు.

Exit mobile version