Sharad Pawar: విదేశీ పర్యటనలతో దేశ ప్రతిష్టతను కాపాడుతున్నారు.. మోడీపై శరద్‌పవార్ ప్రశంసలు
- విదేశాల్లో కొనసాగుతోన్న మోడీ పర్యటన
- ప్రస్తుతం రోమ్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ
- మోడీ విదేశీ పర్యటనలపై శరద్ పవార్ ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ విదేశీ పర్యటనలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్న వేళ.. మిత్రపక్షమైన ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ప్రసంశల జల్లు కురింపించారు. రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నా.. దేశ గౌరవాన్ని కాపాడే విషయంలో రాజకీయాలను పక్కన పెట్టాలని సూచించారు. విదేశాల్లో భారత ప్రతిష్ఠను నిలబెట్టేందుకు ప్రధాని మోడీ పని చేస్తున్నారని శరద్ పవార్ ప్రశంసించారు.
ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో శరద్ పవార్ మాట్లాడారు.. ‘‘దేశ గౌరవాన్ని కాపాడే విషయంలో రాజకీయ విభేదాలను తీసుకురావద్దు. ప్రధాని మోడీ విదేశాల్లో భారత ప్రతిష్ఠను నిలబెట్టేందుకు పని చేస్తున్నారు. మనకు రాజకీయంగా భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ దేశ గౌరవం విషయంలో రాజకీయాలు అడ్డురాకూడదు’’ అని వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాల కోసం కలిసి పని చేసే అవకాశం వస్తే అందరూ ఒకే లక్ష్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, పీవీ.నరసింహారావు, మన్మోహన్ సింగ్ దేశ భవిష్యత్తు, ప్రతిష్ఠను ఎప్పుడూ ముందుంచుకుని నాయకత్వం వహించారని పేర్కొన్నారు.
Also Read
- Modi - Meloni - Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
- Broiler Chicken Facts: బ్రాయిలర్ కోళ్లకు నిజంగా హార్మోన్లు ఇస్తారా..? చికెన్‌పై ఉన్న అపోహల వెనుక అసలు నిజం ఇదే..
- Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్‌తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
- Modi-Meloni: ఇటలీలో ప్రధాని మోడీ.. నేటి చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. మెలోని ఫొటోలు షేర్ చేసిన పీఎం..
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సోవియట్ యూనియన్ పర్యటన సందర్భంగా భారత గౌరవం విషయంలో ఎంత కఠినంగా వ్యవహరించారో కూడా శరద్ పవార్ వివరించారు. ‘‘నేను 40 కోట్ల భారతీయులను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. వారి గౌరవానికి భంగం కలిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను’’ అని ఇందిరాగాంధీ అప్పట్లో చెప్పినట్లు గుర్తుచేశారు.
ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటన కొనసాగుతోంది. ఐదు దేశాల పర్యటన కోసం ఈనెల 15న భారత్ నుంచి బయల్దేరి వెళ్లారు. మంగళవారం నార్వే పర్యటన ముగించుకుని ఇటలీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఇప్పటి వరకు నాలుగు దేశాల్లో పర్యటించగా.. చివరి పర్యటనగా రోమ్‌లో పర్యటిస్తున్నారు. తొలుత యూఏఈలో పర్యటించగా.. అనంతరం నెదర్లాండ్స్, స్వీడన్, నార్వేలో పర్యటించారు. చివరిగా ఇటలీ దేశానికి వెళ్లారు. నేటితో ఐదు దేశాల పర్యటన ముగియనుంది. అనంతరం భారత్‌కు బయల్దేరి రానున్నారు.
తాజావార్తలు
-
Sharad Pawar: విదేశీ పర్యటనలతో దేశ ప్రతిష్టతను కాపాడుతున్నారు.. మోడీపై శరద్‌పవార్ ప్రశంసలు
-
Luger : ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరు వెనుక ఉన్న రహస్యం ఇదేనా..! షాక్‌లో ఫ్యాన్స్!
-
Twisha Sharma: దేహమంతా గాయాలే.. తెలుగు నటి పోస్ట్‌మార్టంలో షాకింగ్ విషయాలు
-
Dhurandhar-2: ‘ధురంధర్ 2’ దేశ భద్రతకు ముప్పా? కేంద్రానికి హై కోర్టు కీలక ఆదేశాలు..
-
Indian Railways: రైళ్లలో వరుస అగ్నిప్రమాదాలు.. కుట్రదారులెవరో బయటపెట్టిన రైల్వే శాఖ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!