Site icon NTV Telugu

Charles Sobhraj: జైలు నుంచి విడుదల కానున్న చార్లెస్ శోభరాజ్.. ప్రపంచాన్ని గడగడలాడించిన సీరియల్ కిల్లర్

Charles Sobraj

Charles Sobraj

Serial Killer Charles Sobhraj To Be Released From Nepal Jail: చార్లెస్ శోభరాజ్ నేరచరిత్రలో ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. 1970లలో ఆసియా మొత్తం వరసగా హత్యలు చేసి ప్రపంచాన్ని గడగడలాడించారు. ఫ్రెంచ్ జాతీయుడైన శోభరాజ్ చిన్నతనం నుంచే నేరాలను ప్రారంభించి పలుమార్లు జైలు శిక్షను అనుభవించాడు. అయితే 2003లో ఇద్దరు అమెరికన్లను నేపాల్ లో హత్య చేశాడు శోభరాజ్. ఈ కేసులో నేపాల్ న్యాయస్థానం శిక్ష విధించింది. తాజాగా అతని వయస్సు దృష్ట్యా అతన్ని విడుదల చేయాలని అక్కడి అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. దీంతో 78 ఏళ్ల శోభరాజ్ అనారోగ్య కారణాలతో జైలులో నుంచి విడుదల కాబోతున్నాడు. 15 రోజుల్లో అతడిని తిరిగి అతడి దేశాని పంపాలని తీర్పు చెప్పింది నేపాల్ సుప్రీంకోర్టు.

భారతీయ-వియత్నామ్ తల్లిదండ్రులకు ఫ్రెంచ్ ఆధీనంలో ఉన్న ఇండోచైనా( ఇప్పటి వియత్నాం)లోని హోచిమిన్ సిటిలో జన్మించాడు చార్లెస్ శోభరాజ్. చిన్నతనం నుంచే నేరాలు ప్రారంభించిన ఇతను ఫ్రాన్స్ లో పలు శిక్షల్లో జైలు శిక్ష అనుభవించాడు. 1970లో శోభరాజ్ ప్రపంచ పర్యటన చేస్తూ అనేక మందిని హత్య చేశాడు. హత్య చేయాలనుకున్న వారిని ఎంచుకుని వారితో మంచిగా నటించడంతో వారిని నమ్మించి మత్తుమందు ఇచ్చి హత్య చేసేవాడు. 1975లో థాయ్ లాండ్ పట్టాయా బీచ్ లో బికినీ ధరించిన ఓ అమెరికన్ యువతి మృతదేహం లభించింది. ఆ తరువాత ఈ హత్యతో చార్లెస్ శోభరాజ్ పేరు వెలుగులోకి వచ్చింది. మొత్తం 20కి పైగా హత్యలు చేసి కరడుగట్టిన సీరియల్ కిల్లర్ గా ముద్ర పడ్డాడు శోభరాజ్. పాస్ పోర్టులు మారుస్తూ ప్రభుత్వాలను బురిడి కొట్టిస్తూ తన నివాసాలను తరుచుగా మారుస్తుండే వాడు.

Read Also: Madhya Pradesh: వీడు కొడుకా..కసాయా..? స్మార్ట్ ఫోన్ కోసం కన్నతల్లినే..

1976లో భారతదేశంలో అరెస్ట్ అయ్యాడు శోభరాజ్. ఒక ప్రెంచ్ టూరిస్ట్ ని ఢిల్లీ హోటల్ లో విషప్రయోగం చేసి చంపాడు. దీంతో ఈ హత్యకు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. 1986లో తప్పించుకుని గోవాలో చిక్కాడు శోభరాజ్ మొత్తం 21 ఏళ్లు జైలులో గడిపాడు. శిక్ష తరువాత పారిస్ వెళ్లిన శోభరాజ్. 2003లో నేపాల్ ఖాట్మాండు లో మళ్లీ ప్రత్యక్షం అయ్యాడు. అయితే 1975 నేపాల్ లో జరిగిన ఇద్దరు యూఎస్ఏ టూరిస్టులను చంపినందుకు అతడికి అక్కడి కోర్టు జీవితఖైదు విధించింది.

ఇదిలా ఉంటే జైలులో శిక్ష అనుభవిస్తున్న మయంలోనే శోభరాజ్ తన నేపాల్ న్యాయవాది కుమార్తె, తన కన్నా 44 ఏళ్లు చిన్నదైన నిహితా బిస్వాస్ ను 2008లో వివాహం చేసుకున్నాడు. ఇతని జీవితం ఆధారంగా నెట్ ఫ్లిక్స్ ‘ ది సర్పెంట్’ వెబ్ సిరీస్ రూపొందించింది.

Exit mobile version