NTV Telugu Site icon

Joe Biden: గాజాలో ఆస్పత్రిపై దాడి ‘‘మీ పని కాదు’’.. ఇజ్రాయిల్‌కి జో బైడెన్ మద్దతు..

Joe Biden

Joe Biden

Joe Biden: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో దారుణ సంఘటన జరిగింది. గాజాలోని అల్-అహ్లీ ఆస్పత్రిపై దాడి జరిగింది. ఈ దాడిలో 500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ప్రధాని మోదీతో పాటు యూఎన్ ఈ దాడిని ఖండించాయి. ఈ దాడి జరిపిన వారే దీనికి బాధ్యత వహించాలని ప్రధాని మోదీ అన్నారు. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయిల్‌కి సంఘీభావం తెలిపేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం ఆ దేశానికి వచ్చారు.

Read Also: PM Modi: ‘‘దాడికి పాల్పడిన వారిదే బాధ్యత’’..గాజా ఆస్పత్రి దాడిపై స్పందించిన పీఎం మోదీ..

ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్ చేరకున్న బైడెన్‌కి ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు స్వాగతం పలికారు. అమెరికా ఇజ్రాయిల్‌కి మద్దతు ఇచ్చేందుకే నేను ఇక్కడికి వచ్చానని బైడెన్ అన్నారు. ఇజ్రాయిల్ తనను తాను రక్షించుకునే హక్కు ఉందని మరోసారి తెలిపారు. ఈ యుద్ధంపై బైడెన్-నెతన్యాహు ఇరువురు సమావేశమయ్యారు. గాజా ఆస్పత్రిపై జరిగిన దాడి అవతలి వాళ్ల పని అని, ఇతర బృందం జరిపిన దాడి అని తెలుస్తోంది, మీరు కాదని ఇజ్రాయిల్ కి మద్దతుగా బైడెన్ మాట్లాడారు.

ఈ దాడి ఇజ్రాయిల్ రాకెట్ దాడుల వల్ల జరిగిందని హమాస్ ఆరోపించగా.. ఇస్లామిక్ ఉగ్రసంస్థ హమాస్ కారణంగానే ఆస్పత్రిలో పేలుడు సంభవించిందని ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడిలో ఇజ్రాయిల్ వైపు 1400 మంది మరణించారు. దీనికి ప్రతిగా గాజాస్ట్రిప్ పై ఇజ్రాయిల్ వైమానిక దళాలు విరుచుకుపడుతున్నాయి. గాజా వైపు 3000 మంది వరకు మరణించారు.