ఉక్రెయిన్-రష్యా యుద్ధ జరుగుతోన్న సమయంలో ఇప్పటికే ఓ భారత విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే కాగా.. తాజాగా మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.. పంజాబ్‌కు చెందిన చందన్ జిందాల్ అనే 22 ఏళ్ల మెడికల్ విద్యార్థి మృతిచెందాడు… అనారోగ్య సమస్యలతో చందన్ జిందాల్ కన్నుమూసినట్టు చెబుతున్నారు.. రక్త గడ్డ కట్టడంతో చందన్ జిందాల్‌ను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. బ్రెయిన్ స్ట్రోక్కారణంగా అతడు మృతిచెందినట్టు జాతీయ మీడియా పేర్కొంది.. ఉక్రెయిన్ విన్నిత్సియాలోని విన్నిత్సియా నేషనల్ పైరోగవ్ మెమోరియల్ మెడికల్ యూనివర్సిటీలో చందన్ జిందాల్ ఎంబీబీఎస్ చదువుతున్నాడు.. అతడి మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.
Read Also: Ukraine Russia War: ఖార్కివ్ అత్యవసరంగా ఖాళీ చేయండి.. భారతీయులకు కేంద్రం ఆదేశాలు
రెండు రోజుల వ్యవధిలోనే భారత్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడిలో కర్ణటకకు చెందిన మెడికల్ విద్యార్థి నవీన్నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే.. దేశవ్యాప్తంగా ఈ ఘటన ఆందోళనలు కలిగించింది. ఈ ఘటన మరవక ముందే.. మరో విద్యార్థి మృతిచెందడం విషాదంగా మారింది. మరోవైపు ఉక్రెయిన్ లో భారత విద్యార్థి మృతిపై రష్యా స్పందించింది. విద్యార్థి నవీన్ మృతిపై దర్యాప్తు చేపట్టింది. ఈ మేరకు భారత్ లోని రష్యా రాయబారి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక, ఖార్కివ్‌లోని భారతీయులకు కేంద్రం అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.. యుద్ధభూమి ఖార్కివ్‌ను తక్షణం వీడాలని స్పష్టం చేసింది ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం.. ఖార్కివ్‌లోని భారతీయులకు ఇండియన్ ఎంబసీ ఈ కీలక సూచనలు చేసిన విషయం విదితమే.
