NTV Telugu Site icon

Earthquake: మయన్మార్‌లో వరస మూడు భూకంపాలు..

Earthquake

Earthquake

Earthquake: భారత సరిహద్దు దేశం మయన్మార్ వరసగా భూకంపాలతో వణుకుతోంది. నిన్న అర్థరాత్రి నుంచి వరసగా మూడు భూకంపాలు నమోదయ్యాయి. గురువారం తెల్లవారుజామున 5 గంటలకు యాంగాన్ లో 4.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. యాంగాన్ కు 174 కిలోమీటర్ల దూరంలో భూమికి 48కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర కేంద్రీకృతమైంది.

Read Also: PM Modi US Visit: ప్రధాని మోడీకి ఘనస్వాగతం పలికిన జో బైడెన్.. వైట్‌హౌస్‌లో విందు..

గురువారం తెల్లవారుజామున 3 గంటలకు 4.2 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. ఈ భూకంపం కేంద్రం భూమి నుంచి 10 కిలోమీటర్ల లోతులో, యాంగూన్ కు 160 కిలోమీటర్ల దూరంలో ఉందని గుర్తించారు. దీనికి కొన్ని గంటల ముందు బుధవారం అర్థరాత్రి 11.57 గంటలకు తొలి భూకంపం వచ్చింది. వరసగా కొన్ని గంటల వ్యవధిలోనే మూడు భూకంపాలు రావడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ మూడు భూకంపాలు కూడా రిక్టర్ స్కేలుపై 4 కన్నా ఎక్కవ తీవ్రతతో సంభవించాయి. దీని వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగనట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.