Seattle Airport Chaos: ఎయిర్‌పోర్టులో హైడ్రామా.. విమానం ఎక్కుతుండగా ఇద్దరిని ఈడ్చుకెళ్లిన ICE అధికారులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seattle Airport Chaos: అమెరికాలోని సియాటెల్-టకోమా అంతర్జాతీయ విమానాశ్రయంలో తీవ్ర కలకలం రేగింది. విమానం ఎక్కేందుకు సిద్ధమవుతున్న ప్రయాణికుల మధ్యకు మాస్కులు ధరించిన ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) అధికారులు ప్రవేశించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విమానంలోకి వెళ్లే మార్గంలోనే ప్రయాణికులను బలవంతంగా ఈడ్చుకెళ్లడం అక్కడున్న వారిని భయాందోళనలకు గురిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
శనివారం ఉదయం లాస్ ఏంజెలెస్‌కు వెళ్లాల్సిన అలాస్కా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 1306లో ప్రయాణికులు ఎక్కుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం 8:10 గంటలకు బయలుదేరాల్సిన విమానం ఈ పరిణామాల కారణంగా ఆలస్యమైంది. మాస్కులు ధరించిన ICE అధికారులు గుర్తింపు లేని జాకెట్లు, ఖాకీ ప్యాంట్లు ధరించి విమానం ఎక్కే జెట్ బ్రిడ్జ్‌పైకి వచ్చారు. అక్కడ ఇద్దరిని అదుపులోకి తీసుకునే క్రమంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. వైరల్ వీడియోలో అధికారులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుంటూ ఈడ్చుకెళ్లడం కనిపించింది. తన కుమార్తెను అధికారులు తీసుకెళ్తున్నారని, ఆమెకు చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్ ఉందని ఓ మహిళ గట్టిగా కేకలు వేయడం వినిపించింది. ఈ దృశ్యాలను చూసిన ఇతర ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
Also Read
- Iran Warns US: అమెరికాకు ఇరాన్ వార్నింగ్.. ‘ఇది ఆరంభం మాత్రమే’.. అండర్‌గ్రౌండ్ మిసైల్ సిటీలో IRGC చీఫ్!
- Iran US Tensions: అమెరికా ఎఫ్-16పై ఇరాన్ క్షిపణి దాడి!
- US-China Chip War: అమెరికా-చైనా మధ్య చిప్ వార్.. 5 దేశాలపై ఆంక్షలు.. ఏఐ రంగంలో సంక్షోభం!
- US Report: భారత్ ఎదుగుదలను తట్టుకోలేక.. ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌కు చైనా మద్దతు..
ఈ ఘటనపై అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు స్పందించారు. రికార్డో లారొండో మెండోజా అనే మెక్సికో పౌరుడిని లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక ఇమ్మిగ్రేషన్ తనిఖీ చేపట్టినట్లు ICE వెల్లడించింది. అతను వీసా గడువు ముగిసినప్పటికీ అమెరికాలోనే ఉంటున్నాడని, ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘించాడని అధికారులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
అయితే ఈ ఆపరేషన్ సందర్భంగా మరో ప్రయాణికురాలు అధికారులపై వేడి కాఫీ విసిరినట్లు ICE పేర్కొంది. ఆమెను సోఫియా హెర్నాండెజ్ మెజియాగా గుర్తించారు. ఆమె కూడా మెక్సికోకు చెందిన వ్యక్తేనని, అమెరికాలో వీసా గడువు ముగిసినప్పటికీ ఉంటున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఫెడరల్ అధికారిపై దాడి చేసిన అభియోగాలు కూడా ఆమెపై మోపే అవకాశం ఉందని వెల్లడించారు. అమెరికాలో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలో కొనసాగుతున్న విదేశీయులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ICE అధికారులు ఇటీవలి కాలంలో విమానాశ్రయాల్లో తనిఖీలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా వేసవి కాలం నుంచి ఇలాంటి అరెస్ట్ ఆపరేషన్లు పెరిగినట్లు సమాచారం.
ఈ ఘటనపై అలాస్కా ఎయిర్‌లైన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ICE అధికారులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే విమానం బోర్డింగ్ సమయంలో ఈ చర్య చేపట్టారని వెల్లడించింది. థ్యాంక్స్ గివింగ్ సెలవులకు ముందు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొంది.
ప్రయాణికులు, ఉద్యోగుల పట్ల గౌరవంగా వ్యవహరించడం తమ సంస్థ బాధ్యత అని అలాస్కా ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఈ ఘటనలో విమానాశ్రయ నిబంధనలు, భద్రతా ప్రోటోకాల్స్ పాటించారా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు పోర్ట్ ఆఫ్ సియాటెల్ అధికారులతో కలిసి పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులకు నేరుగా తమ అభ్యంతరాలను తెలియజేసినట్లు పేర్కొంది.
విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలు చూసుకునే పోర్ట్ ఆఫ్ సియాటెల్ కూడా ఈ ఘటనపై స్పందించింది. అరెస్ట్ సమయంలో బాధిత కుటుంబంతో పాటు అక్కడున్న ఇతర ప్రయాణికులు కూడా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని పేర్కొంది. అసలు ఏం జరిగింది? అధికారులు అనుసరించిన విధానం సరైనదేనా? అనే విషయాలను తెలుసుకునేందుకు స్థానిక అధికారులు ఫెడరల్ అధికారులతో మాట్లాడనున్నట్లు వెల్లడించింది.
‘THEY’RE TAKING MY DAD’ — WOMAN CLINGS to ICE AGENT’S LEG as officers DETAIN PERSON at Seattle Airport
DROPS TO HER KNEES, CRYING and SCREAMING
‘WE HAVE WORK PERMIT’ https://t.co/4dM60A0ywm
— RT (@RT_com) November 21, 2026
తాజావార్తలు
-
Seattle Airport Chaos: ఎయిర్‌పోర్టులో హైడ్రామా.. విమానం ఎక్కుతుండగా ఇద్దరిని ఈడ్చుకెళ్లిన ICE అధికారులు!
-
Iran Warns US: అమెరికాకు ఇరాన్ వార్నింగ్.. ‘ఇది ఆరంభం మాత్రమే’.. అండర్‌గ్రౌండ్ మిసైల్ సిటీలో IRGC చీఫ్!
-
Hyderabad: కొడుకు కావాలి, కూతుళ్లు వద్దంటూ మెసేజ్‌లో ట్రిపుల్ తలాక్.. పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
-
Ather Konarc EV: తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు.. నెలలోనే 83 శాతం పెరిగిన అమ్మకాలు.! ఎందుకింత డిమాండ్?
-
Global Peace Honors: ‘గ్లోబల్ పీస్ హానర్స్’లో తారల సందడి.. సచిన్‌కు ప్రత్యేక గౌరవం..!
ట్రెండింగ్
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!