దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి వక్రబుద్ధి ప్రదర్శించింది. కర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కెక్ వేదికగా షాంఘై సహకార సంస్థ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ప్రధాని మోడీతో పాటు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సహా పలు దేశాధినేతలంతా హాజరయ్యారు.
అయితే ప్రముఖులంతా వేదికపైన గ్రూప్ ఫొటో దిగారు. ఈ వేదికపై ప్రధాని మోడీతో పాటు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఉన్నారు. కానీ ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదు. అయితే వేదికపై మాత్రం ఇద్దరూ కలిసి ఫొటోలో కనిపించారు. అయితే పాకిస్థాన్ ప్రధానమంత్రి కార్యాలయం మాత్రం గ్రూప్ ఫొటో నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగించి.. మార్పు చేసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో మరోసారి పాకిస్థాన్ తన వక్రబుద్ధిని ప్రదర్శించింది.

