Site icon NTV Telugu

ఒమిక్రాన్ తీవ్ర‌త త‌క్కువ‌గా ఉండ‌టానికి కార‌ణం ఇదే…

ఆఫ్రికాలోని బోట్స్‌వానాలో మొద‌టి ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి. ఆ త‌రువాత ఈ వేరియంట్ క్ర‌మంగా ప్ర‌పంచంలోని దాదాపు అన్నిదేశాల‌కు వ్యాపించింది. ముఖ్యంగా అమెరికా, యూర‌ప్ దేశాల్లో ఈ వేరియంట్ కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌య్యాయి. వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉన్న‌ప్ప‌టికీ తీవ్ర‌త త‌క్కువ‌గానే ఉన్న‌ది. మ‌ర‌ణాల సంఖ్య సైతం త‌క్కువ‌గా ఉండ‌టంతో ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకున్నారు. ప‌లు దేశాల్లో వివిధ వేవ్‌ల‌కు ఒమిక్రాన్ కార‌ణ‌మైంది. తీవ్ర‌త త‌క్కువ‌గా ఉండ‌టానికి గ‌ల కార‌ణాలను ప‌రిశోధ‌కులు ప‌రిశోధించారు. డెల్టా వేరియంట్ విజృంభ‌ణ స‌మ‌యంలో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావ‌డం, వ్యాక్సినేష‌న్ కు ప్ర‌పంచ దేశాలు ప్రాధాన్యత ఇవ్వ‌డంతో ప్ర‌పంచంలోని అత్య‌ధిక శాతం ప్ర‌జ‌లు వ్యాక్సిన్ తీసుకున్నారు.

Read: నాటోపై విమ‌ర్శ‌లు… ర‌ష్యాకు చైనా మ‌ద్దతు…

ఈ వ్యాక్సిన్ కార‌ణంగా శ‌రీరంలో వ్యాధినిరోధ‌క శ‌క్తి పెరిగింది. వైర‌స్‌ను అడ్డుకునే యాంటీబాడీలు శ‌రీరంలో వృద్ధి చెందాయి. మరికొంద‌రు ఒమిక్రాన్ కంటే ముందే క‌రోనాకు గురికావ‌డంతో వారిలో యాంటీబాడీలు వృద్ధి చెందాయి. ప్ర‌జ‌ల్లో క‌రోనా స‌మ‌యంలో తీసుకున్న ఆహారం కార‌ణంగా కూడా యాంటీబాడీలు వృద్ధి చెందాయి. వ్యాప్తి అధికంగా ఉన్న‌ప్ప‌టికీ తీవ్ర‌త త‌క్కువ‌గా ఉంద‌ని అమెరికా ప‌రిశోధ‌కులు పేర్కొన్నారు.

Exit mobile version