NTV Telugu Site icon

Celestial event: గ్రహాన్ని కబళిస్తున్న నక్షత్రాన్ని గుర్తించిన సైంటిస్టులు.. ఏదో రోజు భూమికి కూడా ఇదే పరిస్థితి..

Star Distoing Planet

Star Distoing Planet

Star Swallowing A Planet: విశ్వంలో ప్రతీదానికి పుట్టుక, చావు అనేది ఉంటుంది. ఇందుకు గ్రహాలు, నక్షత్రాలు మినహాయింపేం కాదు. ఏదో రోజు సూర్యుడు కూడా అంతం కావాల్సిందే. ఇదిలా ఉంటే తాజాగా శాస్త్రవేత్తలు ఓ నక్షత్రం, దాని చుట్టూ తిరుగున్న గ్రహాన్ని కబళించడాన్ని గుర్తించారు. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT), హార్వర్డ్ యూనివర్సిటీ మరియు కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తల బృందం గ్రహాన్ని, మాతృ నక్ష్రతం ఎలా చంపేస్తుందనే దాన్ని గమినించారు. సూర్యుడి పరిమాణంలో ఉండే నక్షత్రం, గురుడు పరిమాణంలో ఉండే ఓ వాయుగోళాన్ని అంతం చేస్తున్నాడని గుర్తించారు. శాస్త్రవేత్తలు ఈ ఖగోళ విషయాన్ని గమనించడం ఇదే మొదటిసారి.

భూమికి 12,000 కాంతి సంవత్సరాల దూరంలోని అక్విలా కాన్స్టలేషన్ లో దీన్ని గమనించారు. వృద్ధాప్యంలో ప్రతీ నక్షత్రం కూడా చనిపోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా నక్షత్రాలు హైడ్రోజన్ ను హీలియంగా మార్చి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఏదో రోజు నక్షత్రంలోని ఇంధనం పూర్తిగా అయిపోయిన వెంటనే అవి ఉన్న సైజు కంటే కొన్ని వందల రెట్లు పెరుగుతూ..రెడ్ జాయింట్ గా మారుతోంది. ఆ సమయంలోనే గ్రహాలను అంతమొందిస్తుంది. ప్రస్తుతం గమనించిన ఈ ఖగోళ విషయం సూర్యుడి గురించి అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుందని వెల్లడించారు.

Read Also: Hyderabad Crime: అప్పు ఇచ్చి అడినందుకు దారుణం.. హైకోర్టు ముందే హత్య

భూమికి కూడా ఈ ముప్పు తప్పదు..

ప్రస్తుతం సూర్యుడు వయస్సు 4.6 బిలియన్ ఏళ్లుగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. నడి వయస్సులోకి సూర్యుడు చేరినట్లు లెక్కగడుతున్నారు. మరో 5 బిలియన్ ఏళ్ల తరువాత సూర్యుడి తన జీవితం చరమాంకంలోకి వస్తారు. ఆ సమయంలో సూర్యుడిలోని హైడ్రోజన్ పూర్తిగా అయిపోయి రెడ్ జాయింట్ గా మారి సౌర వ్యవస్థలోని అంతర్గత గ్రహాలు అయిన బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడి వరకు విస్తరిస్తారు. ఈ సమయంలో ఈ నాలుగు గ్రహాలు కూడా సూర్యుడికి ఆహారంగా మారుతాయి. భూమి సూర్యుడి చేత కబళించబడుతుంది. ఆ తరువాత తెల్లని మరగుజ్జు నక్షత్రంగా మారి కొన్ని ఏళ్ల తరువాత పూర్తిగా చల్లబడి అంతరించిపోతుంది. సూర్యుడితో పోలిస్తే కొన్ని వేల, వందల రెట్లు ఉన్న నక్షత్రాలు చనిపోయిన తర్వాత బ్లాక్ హోల్స్ గా మారుతుంటాయి.

Show comments