NTV Telugu Site icon

Mice With Two Fathers: శాస్త్రవేత్తల అరుదైన రికార్డ్.. రెండు మగ ఎలుకల నుంచి సంతానం

Mice With Two Fathers

Mice With Two Fathers

Scientists Create Mice With Two Fathers After Making Eggs From Male Cells: జపాన్ సైంటిస్టులు ఓ అరుదైన రికార్డ్ సాధించారు. రెండు మగ ఎలుకల నుంచి ఓ సంతానాన్ని ఉత్పత్తి చేశారు. జపాన్ లోని క్యుషు, ఒసాకా యూనివర్సిటీల శాస్ర్తవేత్తల టీం ఈ ఘనత సాధించింది. పురుష జీవుల చర్మకాణాలలో నుంచి.. అండాలను సేకరించి ఈ ఎలుకలను రూపొందించినట్లు ది గార్డియన్ అనే వార్తా పత్రిక తెలిపింది. మానవులలో కొత్త సంతానోత్పత్తి చికిత్సలకు ఇది దోహదపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ పద్దతిలో ఇద్దరు పురుషులు కలిసి.. పిల్లల్ని కనేందుకు దోహదపడుతుంది.

Pavithra Naresh: ఔను.. వాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు

టర్నర్స్ సిండ్రోమ్ వంటి సంతానోత్పత్తి చికిత్సకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకవేళ ఎక్స్ క్రోమోజోమ్ పూర్తిగా,, పాక్షికంగా మిస్ అయిన ఈ పద్దతిలో విజయవంతంగా చికిత్స చేయవచ్చు. పరుష అండాలను ఉపయోగించి ఓ బలమైన క్షీరదాన్ని సృష్టించడం ఇదే ఫస్ట్ టైం. క్యుషు యూనివర్సిటీ శాస్త్రవేత్త.. కట్సుహికో హయాషి వెల్లడించారు. హ్యూమన్ జీనోమ్ ఎడిటింగ్పై జరిగిన మూడవ అంతర్జాతీయ సమ్మిట్ లో ఈ కీలక పురోగతిని హయాషి సమర్పించారు. లండన్ లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్..లో సమ్మిట్ జరిగింది. గతంలోనూ శాస్త్రవేత్తలు సాంకేతికంగా ఇద్దరు బయోలాజికల్ గా ఫాదర్స్ నుంచి ఎలుకను సృష్టించారు. తల్లుల నుంచి కూడా సృష్టించారు. కానీ రెండు మగ ఎలుకల కణాల నుంచి అండాలను సృష్టించడం ఇదే మొదటి సారి.

German Church Shooting: జర్మనీ చర్చిలో కాల్పులు.. పలువురు మృతి, కొందరికి గాయాలు

ఇండుసెడ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ (IPS) కణాలను సృష్టించడానికి మగ చర్మ కణాలను స్టెమ్ సెల్ లాంటి స్థితికి పరిశోధన బృందం రీప్రోగ్రామ్ చేసింది. ఆ తరువాత వై క్రోమోజోమ్ ను డిలీట్ చేసింది. తరువాత ఎక్స్ క్రోమ్ జోన్ ను రీప్లేస్ చేసింది. ఈ ఎక్స్ క్రోమోజోమ్ ను మరోక సెల్ నుంచి తీసుకున్నారు. రెండు ఒకేలా ఎక్స్ క్రోమోజోమ్ లతో ఐపీఎస్ కణాలను ఉత్పత్తి చేసేందుకు దీన్ని తీసుకుంటారని రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. అంటే పరిశోధనలో మగ ఎలుక చర్మ కణం నుంచి ఒక మూలకణాన్ని సృష్టిస్తారు. ఆపై వై క్రోమోజోన్ ను తొలగిస్తారు.. ఎక్స్ క్రోమోజోన్ ను డూప్లికేట్ చేసి.. అది గుడ్డుగా మారేలా చేస్తారు. తాము ఎక్స్ క్రోమోజోమ్ ను నకిలీ చేయడానికి ఓ కొత్త వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Fetus in Brain: సైన్స్ కే సవాల్.. అమ్మాయి తలలో పిండం

ఈ టెక్నిక్ లను ఉపయోగించి 600 ఇంప్లాంట్ లను రూపొదిస్తున్నాట్లు తెలిపారు. అయితే అందులో ఏడు పిల్లలు మాత్రమే జన్మించాయి. అవి ఆరోగ్యకరమైన జీవితాన్ని గుడుతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇదే టెక్నిక్ ను మానవులలో ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన జపాన్ శాస్త్రవేత్త హయాషి తెలిపారు. రాబోయే పది సంవత్సరాలలో ఇది సాధ్యం కావచ్చని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అవి పునరుత్పత్తికి ఉపయోగపడతాయో లేదా అన్నది మాత్రం తనకు తెలియని హయాషి పేర్కొన్నాడు.

Show comments