Site icon NTV Telugu

Nepal: మహిళా మంత్రిపై మూకుమ్మడి దాడి.. వెలుగులోకి వచ్చిన భయానక దృశ్యాలు

Nepalminister

Nepalminister

నేపాల్‌లో జెన్-జెడ్ ఉద్యమకారులు సృష్టించిన మారణహోమం ఒక్కొక్కటిగా తాజాగా వెలుగులోకి వస్తున్నారు. నిరసన ముసుగులో కొంత మంది ఇష్టానురీతిగా ప్రవర్తించిన దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. కొంత మంది ఇదే అదునుగా మహిళలపై లైంగిక దాడులకు పాల్పడగా.. మరికొందరు మంత్రులను లక్ష్యంగా చేసుకుని సామూహిక దాడులకు పాల్పడ్డారు.

ఇది కూడా చదవండి: Sweden: షాకింగ్ ఘటన.. ప్రెస్‌మీట్‌లో ఉండగా కుప్పకూలిన స్వీడన్ మంత్రి.. వీడియో వైరల్

నాలుగు రోజుల క్రితమే సెప్టెంబర్ 4న త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవుబా పాల్గొన్నారు. అమెరికా ప్రభుత్వం అందించిన రెండు విమానాలను ప్రారంభించారు. ఇంతలోనే హఠాత్తుగా జెన్ జెడ్ నిరసనకారులు ఇంట్లోకి చొరబడి నానా బీభత్సం సృష్టించారు. భౌతికదాడులతో అర్జు రాణా దేవుబా బెంబేలెత్తిపోయారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బయటపడ్డారు. ఇక మాజీ ప్రధాని, నేపాల్ కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేవుబాపై కూడా ఒక గుంపు దాడి చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Kakani Govardhan Reddy: జగన్ను తిడితే పదవిలు వస్తాయని పోటీ పడి మరీ నోరు పారేసుకుంటున్నారు..!

సోషల్ మీడియాపై సెప్టెంబర్ 4న నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే సోషల్ మీడియాపై కాదు.. అవినీతిపై నిషేధం విధించండి అంటూ జెన్ జెడ్ ఉద్యమం చెలరేగింది. సోమవారం 10 వేల మంది నిరసనకారులు ఖాట్మండు ముట్టడించారు. ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. 19 మంది నిరసనకారులు చనిపోయారు. ఇక రెండో రోజు కూడా తీవ్ర రూపం దాల్చింది. ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రుల ఇళ్లులు లక్ష్యంగా దాడులు చేయడంతో పరిస్థితులు చేదాటిపోయాయి. దీంతో ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి, మంత్రులు రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆర్మీ పరిపాలనను చేతుల్లోకి తీసుకుంది. అలాగే కర్ఫ్యూను కొనసాగిస్తోంది.

 

Exit mobile version